కొడుకుతో కలిసి మొదటిసారి ఇళయరాజా

Tue Feb 12 2019 13:31:20 GMT+0530 (IST)

దక్షణాదిలోనే కాదు యావత్ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు మాస్ట్రో ఇళయరాజా. వెయ్యి సినిమాలు పూర్తి చేసినా కోట్లాది అభిమానులను సంపాదించుకున్నా ఇంకా నేను నేర్చుకునే స్టేజిలోనే ఉన్నాను అని చెప్పడం ఆయనకే చెల్లింది. ఆయన సంతానం కూడా ఇదే రంగంలో ఉన్న సంగతి తెలిసిందే. కూతురు భవతారిణి గాయనిగా స్థిరపడగా ఒక అబ్బాయి కార్తీక్ రాజా కొంత కాలం సంగీత దర్శకుడిగా తన ముద్ర వేసినప్పటికీ ఎక్కువ కాలం నిలవలేకపోయారు.మరో వారసుడు యువాన్ శంకర్ రాజా నిలదొక్కుకుని నాన్న అంత గొప్పగా కాకపోయినా తనకంటూ ఒక స్థాయిని సంపాదించుకున్నాడు. లేటెస్ట్ వీడియో సెన్సేషన్ గా మారిన సాయి పల్లవి రౌడీ బేబీ పాటను కంపోజ్ చేసింది ఇతనే. అయితే ఎప్పుడు నాన్నతో కలిసి ఒకే సినిమాకు పని చేసే అదృష్టాన్ని యువాన్ దక్కించుకోలేదు

ఇన్నాళ్ళకి ఆ భాగ్యం కలిగింది. అవును. ఇళయరాజా-యువాన్ శంకర్ రాజాలు కలిసి ఒకే సినిమాకు సంగీతం అందిస్తున్నారు. దాని పేరు మామనితన్. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. వైవిధ్యమైన చిత్రాలతో న్యూ కమల్ హాసన్ గా కీర్తి  ప్రతిష్టలు అందుకుంటున్న విజయ్ సేతుపతి ఇందులో హీరో. గురువుగా భావించే శీను రామస్వామిని దర్శకుడిగా పరిచయం చేస్తూ విజయ్ సేతుపతి తన ఋణం ఈ విధంగా తీర్చుకుంటున్నాడు. ఈ మూవీకే తండ్రి కొడుకులు ఇళయరాజా యువన్ లు కలిసి పనిచేసారు. ఇప్పటికే దీని మీద ఈ రకంగా చాలా బజ్ వచ్చేసింది. మార్కెట్ లేక మనం విజయ్ సేతుపతి సినిమాలు మిస్ అవుతున్నాం కాని లేకపోతే డబ్బింగ్ రూపంలో చాలా అద్భుతాలు చూసేవాళ్ళం.