Begin typing your search above and press return to search.

బొద్దుగుమ్మ అవతారంలో షాకిచ్చిన ఇల్లీ బేబీ

By:  Tupaki Desk   |   17 Oct 2018 6:39 AM GMT
బొద్దుగుమ్మ అవతారంలో షాకిచ్చిన ఇల్లీ బేబీ
X
గోవా బ్యూటీ ఇలియానా డీ క్రజ్ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు దాదాపుగా ఉండరు. తెలుగులో టాప్ స్టార్స్ అందరితో నటించిన ఇలియానా తర్వాత బాలీవుడ్ పై ఫోకస్ చేసింది. ఇక ఆండ్రూ నీబోన్ తో ప్రేమాయణం అందరికీ తెలిసిందే. ఇలియానా - ఆండ్రూ లకు పెళ్ళి అయిందని.. సోషల్ మీడియాలో ఆమె గతంలో చేసిన పోస్టులలో ఇండైరెక్ట్ గా ఆండ్రూ ను హబ్బీ అని ఒప్పుకుందని కొందరి వాదన. ఇలాంటి లాజిక్కులు ఎన్ని చెప్పినా అధికారికం అయితే కాదుగా..?

సరే ఆ విషయం పక్కన బెడదాం.. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే స్లిమ్ముగా.. జీరో సైజ్ లో ఉండే ఇల్లీ బేబీ ఈమధ్య బొద్దుగుమ్మ అవతారంలో కనిపించింది..ఇంకేముంది ఆ ఫోటోలు వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొంతమందేమో పెళ్ళి అయింది కదా.. కాస్త ఒళ్ళు చేసింది అని చిలిపిగా కామెంట్ చేస్తే మరికొందరేమో సినిమాలు తగ్గాయని సైజ్ జీరోకు బై బై చెప్పిందని అంటున్నారు. ఏదేమైనా సన్నని నడుముతో యువకులకు నిద్ర లేకుండా చేసే ఇల్లీ బేబీ ఇలా బొద్దుగా మారడం అభిమానులకు నచ్చడం లేదు.

ఇక సినిమాల విషయానికి వస్తే మాస్ మహారాజా రవితేజ 'అమర్ అక్బర్ అంటోని' సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటిస్తోంది. చాలా రోజుల తర్వాత ఇలియానా ఈ సినిమాతో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇది తప్ప మరో సినిమా ఇలియానా ఖాతాలో లేదు. మరి 'అమర్ అక్బర్ అంటోని' విజయం మాస్ రాజా.. శ్రీను వైట్ల కే కాదు.. ఇల్లీ బేబీ కి కూడా అవసరమే!