Begin typing your search above and press return to search.

తొలిసారి తమిళంలో.. రాజా విక్రమాదిత్యగా

By:  Tupaki Desk   |   24 Sep 2017 5:53 PM GMT
తొలిసారి తమిళంలో.. రాజా విక్రమాదిత్యగా
X
బాలీవుడ్ లో డియోల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అభయ్ డియోల్ రూటు మిగతా వారితో పోలిస్తే కాస్త సెపరేటు. చేసింది తక్కువ సినిమాలే డిఫరెంట్ గా ఉండే వాటిల్లోనే నటించాడు. ఇమేజ్ గురించి కాకుండా కథాబలం ఉన్న మూవీస్ మాత్రమే చేస్తూ వచ్చాడు. ‘దేవ్ డి’ - ‘జిందగీ న మిలేగీ దొబారా’ - ‘ఓయ్ లక్కీ! లక్కీ ఓయ్’ వంటి సినిమాలు సినిమాల పట్ల అతడికున్న అభిరుచికి అద్దం పడతాయి. ఈ హీరో తొలిసారి తమిళంలో నటిస్తున్నాడు. ఆ సినిమాకు అభయ్ కో ప్రొడ్యూసర్ కూడా కావడం ఇంకో విశేషం.

‘ఇదు వేదాళం సొల్లుం కథై’ పేరిట తెరకెక్కుతున్నఈ చిత్రాన్ని రతీంద్రన్ ఆర్.ప్రసాద్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఐదు వందల సంవత్సరాలు రహస్యంగా నడుస్తున్న ఇల్యుమినాటి అనే సొసైటీ గురించిన కథాంశంతో థ్రిల్లర్ జోనర్ లో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో అభయ్ డియోల్ రాజు విక్రమాదిత్యన్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో అతడి పాత్ర వస్తుంది. ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదల చేశారు. ఇందులో రాజు పాత్రలో అభయ్ చాలా డిఫరెంట్ గా ఉన్నాడు. ఈ పాత్ర కోసం అతడు పది కేజీలు తగ్గాడని డైరెక్టర్ చెబున్నాడు. తమిళ్ డబ్బింగ్ కూడా సొంతంగా చెప్పుకుంటున్నాడని.. ఈ సినిమా వరకు అభయ్ అందిస్తున్న సహకారం సూపరని డైరెక్టర్ అంటున్నాడు.

అభయ్ డియోల్ కోలీవుడ్ ఎంట్రీకి స్పైడర్ మూవీ డైరెక్టర్ మురుగదాస్ స్వాగతం పలికాడు. అభయ్ ను తమిళ ఇండస్ట్రీకి ఆహ్వానం పలుకుతున్నానంటూ ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన అభయ్ మురుగదాస్ కు ట్విట్టర్ లోనే థ్యాంక్స్ చెప్పాడు. మీ సపోర్ట్ ఆనందాన్నిచ్చిందంటూ ట్వీట్ లో పెట్టాడు. ‘ఇదు వేదాళం సొల్లుం కథై’ లో అశ్విన్ కాకుమాను - ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.