ఒక్కడు2 స్క్రిప్ట్ రెడీ చేసేశాడట

Fri Apr 21 2017 22:45:32 GMT+0530 (IST)

ఒక్కడు.. ఈ టైటిల్ చెబితే చాలు మహేష్ బాబు అభిమానులకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మహేష్ కెరీర్ ని మలుపు తిప్పి.. స్టార్ ఇమేజ్ స్టేటస్ ను అందించిన సినిమా ఒక్కడు. అప్పటికే మహేష్ కు హిట్స్ ఉన్నాయి కానీ.. తొలిసారిగా మాస్ జనాలను కూడా మెప్పించేసి.. అన్ని వర్గాలను ఆకట్టుకున్న బ్లాక్ బస్టర్ ఇది.

ఇదే సినిమాను తమిళ్ లో కూడా రీమేక్ చేశారు. గిల్లి పేరుతో కోలీవుడ్ ఒక్కడు రీమేక్ కాగా.. ఇళయ దళపతి విజయ్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ధరణి దర్శకత్వంలో త్రిష హీరోయిన్ గా తమిళ్ ఒక్కడు రూపొందింది. పవన్ కళ్యాణ్ తో బంగారం మూవీ చేసిన దర్శకుడు కూడా ఇతనే. రీసెంట్ గా ఈ ధరణి ఓ ఆసక్తి కరమైన విషయం చెప్పాడు. తాను గిల్లి చిత్రానికి సీక్వెల్ చేయాలని భావించడమే కాదు.. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసేశాడట. అంతే కాదు.. విజయ్ కు వినిపించడం కూడా జరిగిపోయిందట. విజయ్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. అప్పుడు మూవీ స్టార్ట్ చేసేస్తానంటున్నాడు ధరణి.

అయితే.. ఒక్కడు ఒరిజినల్ రాసిన గుణ శేఖర్ కి మాత్రం అలాంటి ఆలోచనలు ఏమీ ఉన్నట్లుగా లేవు. ప్రస్తుతం తన కాన్సంట్రేషన్ అంతా రుద్రమదేవి సీక్వెల్ ప్రతాపరుద్రుడు పైనే ఫోకస్ చేశాడు. ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ ని నిజంగా సిద్ధం చేసి సాకారం చేస్తే మాత్రం.. మహేష్ ఫ్యాన్స్ ఫుల్లు ఖుషీ అవుతారనే చెప్పాలి!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/