Begin typing your search above and press return to search.

ట్వీట్స్ ద్వారా డబ్బులు సంపాదించే బాబతు కాదు

By:  Tupaki Desk   |   24 Feb 2017 6:01 PM GMT
ట్వీట్స్ ద్వారా డబ్బులు సంపాదించే బాబతు కాదు
X
చాలా మంది సెలబ్రెటీలకు సోషల్ మీడియాలో అప్ డేట్ లేనిదే పొద్దు గడవదు. నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూ అభిమానులతో టచ్ లో వుండటానికి ట్రై చేస్తుంటారు. తమ పర్సనల్ విషయాలను మొదలుకొని... సమకాలీన అంశాల వరకు తమ అభిప్రాయాలను పోస్ట్ చేస్తూ... క్రేజ్ ను పెంచుకుంటూ వుంటారు.

అలాంటి సోషల్ మీడియా అంటే.. తనకు అసలు ఇష్టం లేదంటోంది బాలీవుడ్ మోస్ట్ ఫైర్ బ్రాండ్ బ్యూటీ కంగన రనౌత్. చాలా మంది తారలు ట్విట్టర్లో అకౌంట్లు తెరిచేసి.. అప్ డేట్స్ పెడుతుంటారు.. మీరెందుకు అలా వుండరు అని మీడియా ప్రశ్నిస్తే... ఆమె ఇచ్చిన షాకింగ్ అన్సర్లు మీడియా జనాల నోట మాట రాకుండా చేశాయి. ‘నన్ను నేను సోషల్ మీడియాలో అమ్ముకోలేను’ అని.. ‘నా అభి ప్రాయాలపై నాకు విలువ ఎక్కువ.. వాటిని సోషల్ మీడియాలో అమ్ముకోలేను కాబట్టే.. అందులో వుండటం లేదు’ అంటూ పెద్ద లెక్చరే ఇచ్చేసింది కంగన.

అంతేకాదు.. ‘మీడియాలో చెప్పే అభిప్రాయాలన్నీ జెన్యూన్ అని ఎలా అనుకోగలం? నాకైతే.. అస్సలు నమ్మ బుద్ధి కావడం లేదు. నేను చెప్పాలనుకున్నది మీడియా ముందే నేరుగా చెబుతా.. దానిపై వీక్షకులే తప్పెంత? ఒప్పెంత అనేది నిర్ణయం తీసుకుంటారు. సోషల్ మీడియాలో అలా కాదు... మనం పోస్ట్ చేసే ప్రతి అభిప్రాయానికీ సమాధానం ఇవ్వాల్సి వుంటుంది. లక్షల్లో ప్రశ్నలు సంధిస్తుంటారు. వారందరికీ సమాధాన పరచి..మెప్పించడం నా వల్ల కాదు’ అంటోంది ఈ ముద్దుగుమ్మ.

అలానే ట్వీట్ల ద్వారా కొంత సెలబ్రెటీలు డబ్బులు కూడా సంపాదిస్తున్నారని తాను ఆ బాపతు కాదని కూడా సెలవిచ్చింది. అలా డబ్బులు తీసుకుని ట్వీట్స్ వేయడం తప్పు కాదంటూనే.. సెలబ్రెటీల ట్వీట్ల వ్యాపారాన్ని బయటపెట్టింది కంగన. చూడాలి ట్వీట్స్ వేసే.. సెలబ్రెటీలు కంగనా వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో?!