హీరోయిన్ తో బౌలర్.. అబ్బే తూచ్

Fri May 19 2017 16:35:45 GMT+0530 (IST)

మన దేశంలో అందరూ సరదాగా ఇష్టపడేది రెండు ఉన్నాయి అవి ఒకటి సినిమా రెండు క్రికెట్. ఒక 50 ఏళ్ల కిందట యూత్ ఇదే చెప్పారు ఇప్పటి యూత్ కూడా ఇదే చెబుతారు. తరవాత తరం కూడా అదే చెప్పవచ్చు అన్నడం లో ఏ మాత్రం సందేహం లేదు. ఇంకోటి కూడా  ఇక్కడ చెప్పుకోవాలి  మన దేశంలో ఏదో సాంప్రదాయంలా ఒక టాప్ క్రికెటర్ ఒక స్టార్ హీరోయిన్ తో ప్రేమలో పడుతాడు. అప్పుడుప్పుడే వస్తున్న ఆటగాడు కావచ్చు లేదా ఇప్పటికే టీమ్ లో మెయిన్ ప్లేయర్ కావొచ్చు.. ఇదే సీన్ చాలాసార్లు చూశాం. యువరాజ్ అండ్ హేజెల్ పెళ్ళిచేసుకున్నాక.. విరాట్ అండ్ అనుష్క యవ్వారం చూస్తూనే ఉన్నాయం.

ఇకపోతే ఇప్పుడు అలాంటిదే ఇక్కడ ఒక కొత్త జంట ప్రేమ చిగురించింది. ఇండియన్ బౌలర్ కమ్ సన్ రైజర్స్ టీమ్ టాప్ ప్లేయర్ భువనేశ్వర్ కుమార్ ఒక తెలుగు నటి తో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్యే అతని సోషల్ మీడియా పేజ్లో ఒక ఫోటోను పెట్టి అందరికీ క్విజ్ టెస్ట్ పెట్టాడు ఎవ్వరో చెప్పుకోండి చూద్దాం అని. పూర్తి ఫోటో పెట్టకుండా  భువనేశ్వర్ కుమార్ మాత్రమే డైనింగ్ టేబల్ దగ్గర కనిపించే లా ఎడిట్ చేసి పెట్టాడు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలదా మనవాళ్ళకి అల్లుకుపోతారుగా. వెంటేనే రంగంలోకి దిగి ఆమే ఎవ్వరో కనుగొన్నారు. అనుస్మృతి సర్కార్ అనే స్మాల్ టైమ్ తెలుగు హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడు అని కరారు చేశారు. ఈ అమ్మాయి నార్త్ చెందిన బెంగాళీ లేడి. తెలుగులో అప్పుడెప్పుడో కొన్ని సినిమాలు చేసిందిలే.

అయితే ఇదే విషయంపై స్పందించిన భువనేశ్వర్ కుమార్ మాత్రం.. ఎప్పటిలాగే.. అందరిలాగే ''అబ్బే తూచ్'' అన్నాడు. ''నేను ఆ అమ్మాయితో డేటింగ్ చేయట్లేదు. మీకు కావల్సిన అమ్మాయి తను కాదు. వదిలేయండి'' అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. గతంలో విరాట కొహ్లీ కూడా అనుష్క శర్మ గురించి ఇలాగే చెప్పాడులే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/