Begin typing your search above and press return to search.

ఇజం.. అచ్చం కబాలి లాగే..

By:  Tupaki Desk   |   20 Oct 2016 5:36 PM GMT
ఇజం.. అచ్చం కబాలి లాగే..
X
మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్- నందమూరి కళ్యాణ్ రామ్ ల కాంబినేషన్ లో రూపొందిన మూవీ ఇజం. సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్- యంగ్ డైరెక్టర్ పా రంజిత్ తో చేసిన సినిమా కబాలి. మరి ఈ రెండింటికి కంపేరిజన్ ఏముంటుంది.. ఎలా సాధ్యం అనిపించడం కరెక్టే కానీ.. ఓ విషయంలో మాత్రం ఈ రెండు సినిమాలు సేమ్ టు సేమ్ అంతే.

ఇప్పుడంటే ఇజం మూవీపై ఇంత క్రేజ్ వచ్చింది కానీ.. ఓ నెలన్నర క్రితం అయితే కంప్లీట్ గా జీరో. వరుసగా ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న కళ్యాణ్ రామ్.. జ్యోతి లక్ష్మి-లోఫర్ లాంటి డిజాస్టర్లతో డీలా పడ్డ పూరీ. వీరిద్దరి కాంబినేషన్ అంటే క్రేజ్ ఏర్పడ్డానికి ఏముంటుంది అనిపించింది. కానీ సడెన్ గా ఓ రోజు.. ముహూర్తాలు గట్రా చూడకుండానే ఇజం టీజర్ ని వదిలేశాడు దర్శకుడు పూరీ. మైండ్ బ్లోయింగ్ విజువల్స్.. కళ్యాణ్ రామ్ నుంచి ఊహించలేని ట్రాన్స్ ఫర్మేషన్.. ఎక్కడా ఊహలకు అందని స్టోరీ.. అన్నిటినీ సమపాళ్లలో మిక్స్ చేసి వదిలిన టీజర్ తర్వాతే ఇజంపై బజ్ క్రియేట్ అయింది.

కబాలి విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. పా రంజిత్ ఏదో ఆర్టిస్టిక్ ఫిలిం తీస్తున్నాడులే అని అంతా సైలెంట్ గా ఉంటే.. 'కబాలిరా' అంటూ మాఫియా డాన్ గెటప్ తో షాక్ ఇచ్చాడు రజినీ. అక్కడి నుంచి హైప్ పెరగడమే తప్ప కబాలి ఎక్కడా తగ్గలేదు. ఫైనల్ గా చూస్తే.. రిజల్ట్ మిక్సెడ్ గానే ఉంది. తెలుగులో ఫ్లాప్.. తమిళ్ లో పర్లేదు అనేలా ఆడింది. మరి అదే టైపులో బజ్ క్రియేట్ చేసిన ఇజం రిజల్ట్ ఇవాళే తేలిపోనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/