Begin typing your search above and press return to search.

‘ఈనాడు’లో ఆ యాడ్.. ఆశ్చర్యమే

By:  Tupaki Desk   |   23 Oct 2016 7:30 AM GMT
‘ఈనాడు’లో ఆ యాడ్.. ఆశ్చర్యమే
X
ఈనాడు తెలుగులో నెంబర్ వన్ న్యూస్ డైలీ. ప్రకటనల ద్వారా అత్యధిక ఆదాయం అందుకునే పత్రిక అదే. ఐతే అందులో అన్ని రకాల ప్రకటనలూ కనిపిస్తాయి కానీ.. సినిమా యాడ్స్ మాత్రం ఉండవు. సినిమా పేజీ నిండా వార్తలే ఉంటాయి తప్ప యాడ్స్ ఉండవు. ఎప్పుడైనా యాడ్ ఉన్నా అది ఈటీవీలో ప్రసారమయ్యే ఏదైనా కార్యక్రమానికి సంబంధించింది అయి ఉంటుంది తప్ప సినిమాలకు సంబంధించింది కాదు.

ఇలా ఈనాడు సినిమా పేజీలో సినిమా ప్రకటనలు లేకపోవడం వెనుక పెద్ద కథే ఉంది. అప్పట్లో రామోజీ రావుకు.. దాసరి నారాయణరావుకు మధ్య విభేదాలు తలెత్తడం.. ప్రకటనల ధరలు తగ్గించకపోవడం, ఇంకొన్ని కారణాలు కూడా కలిసి ‘ఈనాడు’తో పాటు ‘ఈటీవీ’కి కూడా ప్రకటనలు ఇవ్వొద్దని దాసరి నేతృత్వంలో నిర్మాతలంతా కలిసి నిర్ణయం తీసుకోవడం.. అలా వాటికి ప్రకటనలు ఆగిపోవడం.. ఇలా చాలా తతంగం నడిచింది అప్పట్లో. ఐతే ఆ తర్వాత పరిస్థితి వివాదం సద్దుమణిగినా ‘ఈనాడు’ మాత్రం సినిమా ప్రకటనలు తీసుకోలేదు. ఈటీవీలో మాత్రం సినిమా యాడ్స్ వస్తుంటాయి.

ఐతే ఆశ్చర్యకరంగా ఈ రోజు ఈనాడు సినిమా పేజీలో ఒక సినిమా యాడ్ వచ్చింది. అది నందమూరి కళ్యాణ్ రామ్ ‘ఇజం’ సినిమాకు సంబంధించింది కావడం విశేషం. ఈ సినిమా బ్లాక్‌ బస్టర్ హిట్ అంటూ ఈనాడుకు చిన్న యాడ్ ఒకటి ఇచ్చారు. మరి గత రెండు దశాబ్దాలుగా లేనిది ఇప్పుడు ‘ఈనాడు’లో సినిమా యాడ్ ఎలా వచ్చిందో? ఇన్నాళ్లు పెట్టుకున్న షరతుల్ని రామోజీ పక్కనబెట్టేశారా.. ఇకపై ఈనాడు సినిమా పేజీలోనూ రెగ్యులర్‌ గా ప్రకటనలు వస్తాయా..? ఏమో చూద్దాం

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/