Begin typing your search above and press return to search.

ఇజం ఫస్ట్ డే ఇరగేసిందిలే!!

By:  Tupaki Desk   |   22 Oct 2016 7:18 AM GMT
ఇజం ఫస్ట్ డే ఇరగేసిందిలే!!
X
పూరీ జగన్నాధ్ కి మీడియం రేంజ్ హీరోలతో సినిమా తీయడం కొత్త కాకపోయినా.. నందమూరి కళ్యాణ్ రామ్ స్టార్ డైరెక్టర్ సినిమా చేయడం మాత్రం ఇదే మొదటిసారి. అలా తెరకెక్కిన ఇజం.. తొలిరోజున బాక్సాఫీస్ దగ్గర బాగానే ఫేర్ చేసింది.

ఇజంపై అంచనాలు ఎక్కువగానే ఉండగా.. అందుకు తగ్గట్లుగానే కలెక్షన్స్ వచ్చాయి. నందమూరి అభిమానుల్లో మంచి బజ్ ఉండడం కూడా కలెక్షన్స్ ఊహించని స్థాయిలో రావడానికి కారణమైంది. కేవలం ఏపీ తెలంగాణల నుంచే ఇజం ఏకంగా 2.75 కోట్ల షేర్ వసూలు చేసింది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఇజం పెర్ఫామెన్స్ అదిరిపోయిందని అనాలి. 1.09 కోట్ల రూపాయలు ఈ ఏరియా నుంచి మాత్రమే వచ్చాయంటే.. కళ్యాణ్ రామ్ సినిమాపై ఏ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్ ఉందో అర్ధం చేసుకోవచ్చు.

యూఎస్ లో కూడా ఇజంకు బాగానే ప్రదర్శన చేసింది. కేవలం ప్రీమియర్ల నుంచే 44వేల డాలర్లు వచ్చాయి. అంకె తక్కువగా కనిపిస్తున్నా.. కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఇదే బెస్ట్ అనే సంగతి గుర్తుంచుకోవాలి. వీకెండ్స్ లో వసూళ్లు బాగానే ఉంటాయనే అంచనాలు ఉన్నాయి. నందమూరీ హీరో చూపించిన సిక్స్ ప్యాక్.. మిస్ ఇండియా అదితి ఆర్య బాగానే ఎట్రాక్ట్ చేశాయి. అయితే.. మౌత్ టాక్ అంత పాజిటివ్ గా లేకపోవడం ఒక్కటే ఇజంకు మైనస్ పాయింట్ అని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/