Begin typing your search above and press return to search.

డీజే కూడా పాత వంటేనా హరీశా?

By:  Tupaki Desk   |   22 Jun 2017 7:31 PM GMT
డీజే కూడా పాత వంటేనా హరీశా?
X
స్టైలిష్ స్టార్ లేటెస్ట్ మూవీ కోసం అభిమానులు ఆత్రంగానే ఎదురుచూస్తున్నారు. వరుస హిట్స్ తో జోరు మీదున్న బన్నీని థియేటర్లలో చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. మోస్ట్ ఎంటర్టెయినింగ్ కేరక్టర్ అంటూ తనకు తానే చెప్పేసుకుని మరీ వస్తున్న డీజేపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయ్ కానీ.. ఈ చిత్రం విషయంలో హరీష్ శంకర్ కొత్తగా ఏదైనా ట్రై చేశాడా లేదా అనే డిస్కషన్ బాగానే నడుస్తోంది.

సహజంగా హరీష్ శంకర్ మూవీస్ లో అంత కొత్తదనం ఏమీ కనిపించదు. విలన్ కూతురిని ట్రాప్ చేసి విలన్ ను ఇండియాకు రప్పించడం అనే ఓల్డ్ కాన్సెప్ట్ ని.. మిరపకాయ్ గా రూపొందించాడు ఈ దర్శకుడు. ఆ తర్వాత గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ కొట్టినా.. అసలు స్క్రిప్ట్ వేరు. అది ప్రిపేర్ చేసుకున్నది కూడా పవన్. దానికి హరీష్ మార్క్ డైలాగ్ టచెస్ పడ్డాయంతే. ఇక హీరో అమాయకుడిలా నటించి విలన్స్ ను అంతం చేయడమనే పాత పులిహోరను.. రామయ్యా వస్తావయ్యాలో చూపించి ఎన్టీఆర్ కు ఓ భారీ ఫ్లాప్ ఇచ్చాడు. తనకు తాను బ్లాక్ మార్క్ వేసుకున్నాడు.

రామయ్యా షాక్ నుంచి కోలుకుని మళ్లీ సినిమా చేయడానికి హరీష్ శంకర్ కు ఏళ్లు పట్టింది. హీరో అమెరికా వెళ్ళి డాలర్ల కోసం ఏదైనా చేసేయడం.. హీరోయిన్ ఇంటికి వెళ్ళి అందరినీ ఆకట్టుకోవడమనే పాత చింతకాయ పచ్చడి కాన్సెప్ట్ ను తీసుకుని.. సుబ్రమణ్యం ఫర్ సేల్ రూపొందించాడు. ఇది పర్లేదనిపించేలా ఆడింది.

ఇప్పుడు బన్నీతో చేసిన డీజే ట్రైలర్ చూస్తుంటే.. డీజే కథపై ఓ అంచనాకు రావడం పెద్ద కష్టమే కాబోదు. పుట్టుకతో బ్రాహ్మణుడైన డీజే.. వంటోడిగా నటిస్తూ మర్డర్లు చేసి పెట్టే ఒక కిల్లర్. ఇన్ డైరెక్టుగా పోలీస్ డిపార్టుమెంటుకు సాయం చేయడం అన్న మాట. మరణమృదంగం నుండి పోకిరి వరకు ఇలాగే ఉంటాయి. అపరిచితుడు.. అదుర్స్ వంటి సినిమాల్లో ఇలా బ్రాహ్మణుడు.. కామెడీ.. మర్డర్ల కాన్సెప్టును కూడా చూసేశాం. మరి దువ్వాడ జగన్నాధం స్టోరీ విషయంలో హరీష్ శంకర్ ఏదైనా కొత్తదనం చూపించి ఉంటాడా.. లేక తనకు అలవాటైన ధోరణిలో 'ఇంగువ లేని పులిహోర' మాదిరిగా 'కొత్తదనం లేని సినిమా కథ' వండాడో చూడాలి.