Begin typing your search above and press return to search.

సినిమాలకు ఈ రెండు స్ట్రోక్స్ తప్పవా?

By:  Tupaki Desk   |   23 March 2019 4:31 AM GMT
సినిమాలకు ఈ రెండు స్ట్రోక్స్ తప్పవా?
X
వచ్చే నెల నుంచి క్రేజ్ ఉన్న కొత్త సినిమాల సందడి మొదలుకానుంది. వారానికో మూవీ చొప్పున ప్రేక్షకులకు సైతం మంచి ఆప్షన్లు రాబోతున్నాయి. అయితే రెండు విషయాలు మాత్రం బయ్యర్లను టెన్షన్ పెడుతున్నాయి. ఒకటి ఎన్నికలు. రెండు ఐపిఎల్. ఇప్పటికే ఎలక్షన్ తాలుకు ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. జనం థియేటర్లకు పెద్దగా రావడం లేదు.

ఏదో కొద్దో గొప్పో పాజిటివ్ టాక్ వచ్చిన వాటికి తప్ప మిగలిన వాటిని పట్టించుకునే నాధుడు లేడు. బిసి సెంటర్స్ లో పరిస్థితి ఇంకా దారుణం. హిట్ టాక్ వచ్చిన కేసరి లాంటి హింది సినిమాలకు సైతం ఆదరణ తక్కువగా ఉంది. న్యూస్ పేపర్లు మొదలుకుని మీడియా ఛానల్స్ దాకా అందరూ ఎన్నికల మీదే దృష్టి పెట్టారు. జనసేన ఎంట్రీతో పోటీ రసవత్తరంగా మారిపోవడంతో అంచనాలు చర్చలు వగైరాలతో కనీసం ఏప్రిల్ 11 దాకా ఈ మూడ్ లో నుంచి బయటికి వచ్చేలా కనిపించడం లేదు

ఇదొకటే అనుకుంటే ఈ రోజు నుంచి ఐపిఎల్ స్టార్ట్ కాబోతుంది. భారీ ఎత్తున ప్రచారంతో ఊదరగొడుతున్నారు. ఇది ఒకటి రెండు వారాలకు పరిమితమైన టోర్నమెంట్ కాదు. రెండు నెలలకు పైగా నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ దొరకబోతోంది. క్రికెట్ ప్రేమికులు కీలక మ్యాచులను దేన్నీ వదులుకోరు. సినిమా కావాలంటే తర్వాత చూసుకోవచ్చు. కాని మ్యాచులు లైవ్ చూస్తేనే మజా.

ఈ నేపధ్యంలో ఐపిఎల్ ప్రభావం కలెక్షన్ల మీద కాస్త ఎక్కువగానే ఉండేలా కనిపిస్తోంది. ఏప్రిల్ 5న మజిలితో క్యు కట్టబోతున్న టాలీవుడ్ సినిమాలకు ఈ ఎలక్షన్లు ఐపిఎల్ మ్యాచులు ఎంత మేరకు ఎఫెక్ట్ ఇస్తాయనే విషయంలో ట్రేడ్ ఆందోళనలో ఉన్న మాట వాస్తవం.

అసలే రెండు నెలల నుంచి యమా డ్రై గా ఉన్న బాక్స్ ఆఫీస్ కు అర్జెంటుగా ఓ బోణీ కావాలి. నాగ చైతన్య సమ్మర్ లో ఫస్ట్ ఓపెనర్ గా వస్తున్నాడు. ఎంత మేరకు అంచనాలు నిలబెట్టుకుంటాడో ఈ రెండు వైపులా కాచుకున్న గండాలను దాటుకుని మిగిలిన వాళ్ళకు స్ఫూర్తి ఇస్తాడేమో చూడాలి