Begin typing your search above and press return to search.

నాన్న వెళ్ళగొడితేనే హీరో అయ్యాడట!

By:  Tupaki Desk   |   16 Sep 2019 10:34 AM GMT
నాన్న వెళ్ళగొడితేనే హీరో అయ్యాడట!
X
బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా విభిన్నమైన కథలు.. వింత స్క్రిప్టులు ఎంచుకుంటూ హిట్స్ పై హిట్స్ సాధిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. రీసెంట్ గా ఆయుష్మాన్ నటించిన 'డ్రీమ్ గర్ల్' రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. తన గత సినిమాల తరహాలోనే ఈ సినిమా కూడా సూపర్ హిట్ దిశగా పయనిస్తోంది. ఈ సినిమా సక్సెస్ లో ఉన్న ఆయుష్మాన్ ఫుల్ జోష్ లో తన 35 పుట్టిన రోజును సెప్టెంబర్ 14 న జరుపుకున్నాడు.

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు. తన జీవితంలో కీలక పాత్ర పోషించింది.. తనను ముందుకు నడిపించింది నాన్నగారు పీ. ఖురానా గారేనని చెప్పాడు. ఆయుష్మాన్ నాన్నగారు ఒక ఆస్ట్రాలజర్ అని.. తనకు ఎప్పుడూ జీవితంలో గొప్పగా సాధించాలని నూరిపోసేవారని చెప్పాడు. చండీగఢ్ లో తన కాలేజి చదువు పూర్తయిన తర్వాత ఖాళీగా పనీపాట లేకుండా ఉండేవాడినని.. ఆ సమయంలో "ఊరికే ఇంట్లో కూర్చొని ఉంటావెందుకు.. బైటకు వెళ్లి ఏదో ఒకటి గొప్పగా సాధించు".. అంటూ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడట. ఆయుష్మాన్ బ్యాగును స్వయంగా ఆయనే సర్ది.. టికెట్స్ బుక్ చేసి మరీ ముంబైకి పంపించారట.

నాన్నగారికి తను గొప్పగా సాధిస్తే చూడాలని కోరిక అని.. అదుకే అలా చేశారని చెప్పాడు. 'జనాల పల్స్ తెలుసుకోవాలని' కూడా అయన కొడుక్కు చెప్పేవారట. నాన్నగారు జ్యోతిష్కుడు అయినప్పటికీ ఆయుష్మాన్ కు ఆస్ట్రాలజీ పై అసలు నమ్మకం లేదట కానీ అయనే తనకు గురువు..కోచ్ అని తెలిపాడు. తనను ఇంట్లోనుంచి పంపించే సమయంలో "వెళ్ళు.. ఒక నటుడిగా మారు. చండీగఢ్ లో డేరా వేసుకొని కూర్చుంటే ఏం సాధించలేవు" అంటూ హితబోధ చేశారట.

ఆయుష్మాన్ ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికి 16 ఏళ్ళయింది. మొదట 19 ఏళ్ళ వయసులో రోడీస్ రియాలిటీ షో లో పాల్గొన్నాడు. ఆ తర్వాత ఎన్నో ప్రయత్నాల అనంతరం 27 ఏళ్ళకు నటుడిగా అవకాశం వచ్చింది. ఇప్పుడు బాలీవుడ్ లో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు.