Begin typing your search above and press return to search.

వారికి పిన్నిలా ఉండాలని నాకు లేదు : కరీనా

By:  Tupaki Desk   |   22 Nov 2018 5:22 AM GMT
వారికి పిన్నిలా ఉండాలని నాకు లేదు : కరీనా
X
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌, హీరో సైఫ్‌ అలీఖాన్‌ లు కొన్నాళ్ల క్రితం వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. కరీనాను వివాహం చేసుకోక ముందే సైఫ్‌ అలీఖాన్‌ కు అమృత సింగ్‌ తో వివాహం అయ్యింది. సైఫ్‌, అమృత కు ఇద్దరు పిల్లలు సారా అలీ ఖాన్‌, ఇబ్రహీం కూడా ఉన్నారు. అయితే అమృత నుండి విడిపోయిన సైఫ్‌ అలీ ఖాన్‌ ఆ తర్వాత కరీనా కపూర్‌ ను వివాహం చేసుకున్నాడు. కరీనాతో వివాహం అయిన తర్వాత కూడా సారా మరియు ఇబ్రహీంలతో సైఫ్‌ ప్రేమగా ఉంటున్నాడు. తాజాగా కాఫీ విత్‌ కరణ్‌ షోలో కూతురు సారాతో కలిసి సైఫ్‌ పాల్గొన్నాడు.

కరణ్‌ షో లో సారా మాట్లాడుతూ నేను కరీనాను పిన్ని అంటే ఆమెకు గుండె పగిలి పోతుందని వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. సారా వ్యాఖ్యలపై తాజాగా కరీనా కపూర్‌ స్పందించింది. సైఫ్‌ పిల్లల విషయంలో మీరు ఎలా ఉంటారని ప్రశ్నించిన సమయంలో కరీనా మాట్లాడుతూ.. వారిని అమృత గారు చక్కగా పెంచారు. వారి ప్రవర్తన చూస్తుంటే ముచ్చటేస్తుంది. వారికి ఏ సమయంలో ఎలాంటి తోడ్పాటు కావాలన్నా నా నుండి తప్పకుండా ఉంటుంది. వారు కెరీర్‌ లో బాగుండాలని నేను కోరుకుంటూ ఉంటాను. కెరీర్‌ లో వారు స్థిరపడేందుకు నా వంతు సలహాలు ఇస్తూ ఉంటాను.

ఎంత అప్యాయంగా ఉన్నా కూడా నేను వారి తల్లిని కాలేను అని చెప్పుకొచ్చింది. వారికి పిన్నిలా ఉండటం కంటే నాకు వారితో ఒక స్నేహితురాలిగా ఉండటం ఇష్టం మంటూ చెప్పుకొచ్చింది. వారికి ఒక స్నేహితురాలిగా ఎప్పుడు వారితో ఉంటాను అంది.