Begin typing your search above and press return to search.

అక్కడ ఉర్రూతలూగించేసిన జక్కన్న

By:  Tupaki Desk   |   24 Sep 2017 8:03 AM GMT
అక్కడ ఉర్రూతలూగించేసిన జక్కన్న
X
రాజమౌళి గొప్ప దర్శకుడే కాదు.. మంచి మాటకారి కూడా. వేదికలెక్కితే చాలా బాగా మాట్లాడతాడు. తెలుగు.. తమిళం.. ఇంగ్లిష్ ఏదైనా దంచి కొడతాడు. చాలా ఆసక్తికర ప్రసంగాలు చేస్తుంటాడు. తాజాగా కర్ణాటకలోని మణిపాల్ యూనివర్శిటీలో జరిగిన ఓ కార్యక్రమానికి అతిథిగా వెళ్లాడు జక్కన్న. అక్కడ ఆయనకు విద్యార్థులు బ్రహ్మరథం పట్టారు. ఒక సూపర్ స్టార్ హీరోను చూసినట్లుగా ఫీలవుతూ.. ఆయన మాట్లాడుతున్నంతసేపూ చప్పట్లు.. కేరింతలతో ఆడిటోరియాన్ని హోరెత్తించేశారు. తన ప్రసంగంలో భాగంగా సినిమా సంగతులతో పాటు వ్యక్తిగత విషయాలనూ పంచుకున్నాడు జక్కన్న.

తనను ఎందుకు ఈ యూనివర్శిటీకి పిలిచారో అర్థం కాలేదంటూ రాజమౌళి తన ప్రసంగాన్ని మొదలుపెట్టడం విశేషం. తనతో చాలామంది సెల్ఫీలు దిగిన నేపథ్యంలో రాజమౌళి స్పందిస్తూ.. ‘‘సెల్ఫీల కోసమేనా పిలిచారు.. నాతో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తే ఎన్ని లైకులొస్తాయి.. ఓ 200 లైక్స్ వస్తాయా’’ అంటూ విద్యార్థులతో చమత్కరించాడు రాజమౌళి. సక్సెస్ అంటే రెండు రకాలుగా ఉంటుందని.. జీవితంలో సక్సెస్ కావడం ఒకటైతే.. కెరీర్లో సక్సెస్ కావడం ఇంకోటని.. అదృష్టవశాత్తూ తాను రెండు విషయాల్లోనూ విజయం సాధించానని అనుకుంటున్నానని రాజమౌళి అన్నాడు. తన భార్య పెళ్లయిన కొత్తలో తనను ఉత్తమ భర్త అనేదని.. ఇప్పుడు కూడా అదే మాట అంటోందని.. కాబట్టి తాను జీవితంలో విజయవంతం అయ్యాననే అనుకుంటున్నానని.. తన సినిమాలు కూడా బాగా ఆడాయి.. ఆడుతున్నాయి కాబట్టి కెరీర్లో కూడా విజయం సాధించినట్లు భావిస్తున్నానని చెప్పాడు రాజమౌళి. ఓ కథను ఆసక్తికరంగా చెప్పడంలో.. క్యారెక్టర్ ఎలివేట్ అయ్యేలా చేయడంలో తాను బెస్ట్ అని రాజమౌళి ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు.