Begin typing your search above and press return to search.

వీడియో : నాట్ సో లిటిల్ సోల్జెర్స్..

By:  Tupaki Desk   |   2 Dec 2015 4:33 AM GMT


90వ దశకంలో చదువుకున్న ప్రతీ వారికీ తమ బాల్యంలో మర్చిపోలేని సినిమా లిటిల్ సొల్జెర్స్. ఆ కాలంలో ఈ సినిమా చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. పిల్లలు తమ తల్లిదండ్రుల్ని ఈ సినిమాకు 3 - 4 సార్లు తీసుకెళ్ళమని మారాం చేసేవారు. ఇక ఆ సినిమాలో హై లైట్ గా నిలిచిన పాట 'ఐ యామ్ వేరి గుడ్ గర్ల్' ఎప్పటికీ మర్చిపోలేం.

అయితే ఇన్నేళ్ళ తరువాత ఆ పాటను రిప్ చేసి పునర్చిత్రీకరణ జరిపారు. ఇందులో విశేషం ఏమిటంటే లిటిల్ సొల్జెర్స్ లో చిట్టి పాపగా నటించిన కావ్య అన్నపరెడ్డి చేత మరోసారి దాదాపు ఆ పాటను తలపించే వీడియో తీసి మెప్పించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్ లో హల్ చల్ చేస్తుంది. కావ్య సంగీత్ సందర్భంగా ఆమె సోదరుడు ఈ పాటను ప్రత్యేకంగా రూపొందించారు. ఈ పాటలో కావ్య సొంత తల్లిదండ్రులు కూడా నటించడం విశేషం. వీడియో టైటిల్ లో పెట్టిన మేరియో వీడియో గేమ్ కాన్స్పేట్ కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసి మీ స్మృతులను మరోసారి నెమరువేసుకోండి మరి..