Begin typing your search above and press return to search.

అన్నాచెల్లెళ్లపై అలాంటి సినిమా!?!

By:  Tupaki Desk   |   12 Sep 2017 5:07 PM GMT
అన్నాచెల్లెళ్లపై అలాంటి సినిమా!?!
X
మన దేశంలో సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. బైట పాటించే వాటికంటే సినిమాల్లో ఇంకా ఎక్కువగా ఇలాంటి సెంటిమెంట్స్ ఉంటాయి. ఇలాంటి విషయాల్లో కొద్దిపాటి రిస్క్ ను బేర్ చేసేందుకు మూవీ మేకర్స్ సిద్ధంగా ఉండరు. అయితే.. బోల్డ్ మూవీస్ కి మాత్రం ఇలాంటి రూల్స్ ను కొన్నింటిని గట్టుమీద పెడుతూ ఉంటారు.

అలాగని మరీ మన జనాలు అంగీకరించలేని స్థాయి వరకూ కథా కథనాలు ఉండవు. అయితే.. ఇప్పుడు మొదటిసారిగా అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమపై సినిమా రాబోతోంది. అన్నాచెల్లెళ్ల ప్రేమ అంటే.. అదేదో పుట్టింటికి రా చెల్లీ టైపులో సెంటిమెంటల్ మూవీ అనుకోకుండి. ఆ ఇద్దరి మధ్య మన సమాజం అంగీకరించలేని సంబంధం ఉంటే ఎలా ఉంటుందన్నదే ఈ మూవీ కాన్సెప్ట్. మనోజ్ జయంతి లాల్ భాటి దర్శకత్వంలో ఐయామ్ రోషిణి అనే సినిమాను ఇదే తరహా కథతో తెరకెక్కించారు. ఇందులో అన్నా.. చెల్లి మధ్య అత్యంత సన్నిహిత సంబంధాన్నే ఫోకస్ చేశారు. రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ చేయగా.. ఇప్పటికే ఈ సబ్జెక్ట్ వివాదాస్పదం అవుతోంది.

తొలిసారిగా ఇండియన్ స్క్రీన్ పై ఈ సబ్జెక్ట్ ను డిస్కస్ చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్.. చాలామందికి నచ్చడం లేదు. తన కుటుంబంతో నివసించే రోషిణి అనే అమ్మాయి కథే ఈ సినిమా. తన సోదురడితో అనుబంధాన్ని ఏర్పరుచుకుంటుంది. అయితే.. ఐయామ్ రోషిణి మూవీలో ఎలాంటి వల్గర్ సీన్స్ ఉండవని మేకర్స్ అంటున్నారు. చెల్లెలికి అత్యంత క్లిష్టమైన సమయాల్లో కూడా అండగా నిలిచే ఓ సోదరుడి కథే ఈ చిత్రం అనిచెబుతున్నారు. అంకి పరిహార్.. యష్ రాజ్ పురా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.