లవ్ ఫెయిల్యూర్స్ పై హీరోయిన్ ఓపెన్

Mon Feb 18 2019 16:48:35 GMT+0530 (IST)

హీరోయిన్స్ ఎక్కువ శాతం లవ్ ఎఫైర్స్ కలిగి ఉంటారనే ప్రచారం ఎక్కువగా ఉంటుంది. కాని హీరోయిన్స్ ఎవరు కూడా తమ లవ్ ఎఫైర్స్ ను - లవ్ ఫెయిల్యూర్స్ ను బయటకు చెప్పేందుకు ఆసక్తి చూపించరు. మీడియాలో వాటి గురించి కథనాలు వచ్చినా కూడా కొట్టి పారేస్తూ ఉంటారు. అయితే తమిళ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాత్రం తన రెండు లవ్ ఫెయిల్యూర్స్ గురించి పూస గుచ్చినట్లుగా చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. ఇంటర్ లోనే తాను ప్రేమలో పడ్డానని చెప్పిన ఐశ్వర్య రాజేష్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ... తాను ఇంటర్ లో ఉన్న సమయంలో ఒక అబ్బాయిని ప్రేమించాను - అతడితో చాలా ఘాడమైన ప్రేమలో ఉన్న సమయంలో అతడు నన్ను మోసం చేశాడు. అయితే అతడు నన్ను మోసం చేయడానికి కారణం నా స్నేహితురాలే. నాతో ఎప్పుడు ఉండే స్నేహితురాలినే అతడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ బాధ నుండి నేను తేరుకోవడానికి చాలా సమయం పట్టింది. మళ్లీ కొన్నాళ్లకు ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డాను.

రెండవ సారి ప్రేమలో పడ్డ తాను ఎక్కువ కాలం ప్రేమలో కొనసాగలేదు. కొన్ని విభేదాల కారణంగా విడిపోయాం. అప్పటి నుండి తాను మళ్లీ ప్రేమలో పడకూడదని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం పూర్తి దృష్టి సినిమాలపైనే ఉందని చెప్పుకొచ్చింది. లవ్ బ్రేకప్ ను అంతా సింపుల్ గా తీసుకుంటారు. కాన నేను మాత్రం లవ్ ఫెయిల్యూర్ ను అంత ఈజీగా తీసుకోలేక పోయాను. అందుకే మరోసారి ప్రేమ గురించి ఆలోచించే ధైర్యం చేయడం లేదు. ప్రస్తుతం ఈమె తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా రెండు మూడు సినిమాలకు కమిట్ అయినట్లుగా తెలుస్తోంది.