Begin typing your search above and press return to search.

రజినీ చూసిన బెస్ట్ సినిమా ఇదేనట

By:  Tupaki Desk   |   4 Feb 2016 9:56 AM GMT
రజినీ చూసిన బెస్ట్ సినిమా ఇదేనట
X
ఒక సినిమా విడుదల కాకముందే మొత్తం ఇండస్ట్రీ అంతా ‘అద్భుతం’ అనేయడం అరుదుగా జరుగుతుంటుంది. తమిళ సినిమా ‘విసారణై’ విషయంలో ఇదే జరుగుతోంది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి తమిళ సినీ పరిశ్రమ ఆరు నెలల ముందు నుంచి తెగ చర్చించుకుంటోంది. వెనిస్ చలన చిత్రోత్సవంలో హ్యూమన్ రైట్స్ మీద తీసిన బెస్ట్ మూవీగా అవార్డు అందుకున్న నాటి నుంచి ఈ సినిమాపై ఆసక్తి మొదలైంది. ఆ తర్వాత కూడా కొన్ని ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శితమైన ఈ చిత్రం ప్రశంసలతో పాటు పురస్కారాలు కూడా అందుకుంది. ఇప్పుడిక ఈ సినిమా రిలీజ్ కు కొన్ని రోజుల ముందే కోలీవుడ్ లో సినీ ప్రముఖులకు, మీడియా వాళ్లకు స్పెషల్ షో వేశారు.

ఆ షో చూసిన వాళ్లందరిదీ ఒకటే మాట.. ‘విసారణై’ అద్భుతమైన సినిమా అని. స్వయంగా సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం ఈ సినిమా మీద ప్రశంసల జల్లు కురిపించారు. తాను ఇన్నేళ్లలో చూసిన సినిమాలన్నింట్లో ఇదే బెస్ట్ మూవీ అని కితాబిచ్చేశారంటేనే ఆ సినిమా గొప్పదనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. కమల్ హాసన్ - ప్రియదర్శన్ - మణిరత్నం లాంటి లెజెండ్స్ అంతా కూడా ఈ సినిమాను గొప్పగా పొగిడారు. మీడియా వాళ్లు కూడా ఇది అద్భుతమైన సినిమా అంటూ రివ్యూలు రాశారు. ధనుష్ కు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన ‘ఆడుగళం’ సినిమాను డైరెక్ట్ చేసిన వెట్రిమారన్ ఈ చిత్రానికి దర్శకుడు. వెట్రిమారన్‌ తో కలిసి ధనుషే ఈ చిత్రాన్ని నిర్మించాడు. మధురైకి చెందిన ఓ ఆటోవాలా తన నిజ జీవిత అనుభవాలతో రాసిన కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.