Begin typing your search above and press return to search.

'యాత్ర'లోని ఆ సీన్స్‌ నన్ను కదిలించాయి

By:  Tupaki Desk   |   10 Feb 2019 1:10 PM GMT
యాత్రలోని ఆ సీన్స్‌ నన్ను కదిలించాయి
X
తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'యాత్ర' చిత్రంకు అన్ని వర్గాల నుండి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందనతో బాక్సాఫీస్‌ కూడా కళకళలాడిపోతుంది. మొదటి వారంలోనే ఈ చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ దక్కించుకోవడం ఖాయం అన్నట్లుగా ట్రేడ్‌ వర్గాల వారు నమ్మకం వ్యక్తంచేస్తున్నారు. వైఎస్‌ ఆర్‌ పాత్రలో మమ్ముటీ పాత్ర అల్టిమేట్‌ గా ఉందని, ఆయన నటించకుండా జీవించారంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక ఇదే పాత్రలో వైఎస్‌ కు అత్యంత సన్నిహితుడు అయిన కేవీపీ పాత్రలో రావు రమేష్‌ నటించిన విషయం తెల్సిందే. ఆయన పాత్రకు, నటనకు కూడా మంచి రెస్పాన్స్‌ దక్కింది.

తాజాగా రావు రమేష్‌ మీడియాతో మాట్లాడుతూ సినిమాపై, సినిమాలోని తన పాత్రపై స్పందించాడు. ఇది డబ్బుల కోసం తీసిన సినిమా కాదని, గుండెను టచ్‌ చేసే సినిమా. రాజకీయ సినిమాలు తీసే సమయంలో ఏదో ఒక చోట, ఎవరో ఒకరిపై చెడుగా ఉంటుంది. కాని యాత్రలో మాత్రం అలా కాకుండా దర్శకుడు చక్కగా చూపించాడు. ఇలాంటి సినిమాలో నటించినందుకు గౌరవంగా, గర్వంగా ఉంది.

వైఎస్‌ ఆర్‌ పాదయాత్ర సీన్స్‌ ను అప్పటి పాదయాత్రను కళ్లకు కట్టినట్లుగా దర్శకుడు చూపించాడు. ముఖ్యంగా రైతులు కష్టాలు చెప్పుకునే సీన్స్‌ గుండెను పిండేసే విధంగా ఉన్నాయి. మన రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉందా అనిపించింది. ఇలాంటి పరిస్థితుల మద్య బ్రతుకుతున్నామంటే సిగ్గేసింది. పాదయాత్ర సీన్స్‌ దర్శకుడు రియాల్టీకి దగ్గరగా చూపించాడంటూ రావు రమేష్‌ అన్నాడు.