అవి లేకుండా బయటకు వెళ్లలేక పోతున్నాడట!

Fri Dec 14 2018 07:00:01 GMT+0530 (IST)

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ బాహుబలి కి ముందు బాహుబలి కి తర్వాత అన్నట్లుగా మారిపోయింది. బాహుబలి ముందు వరకు టాలీవుడ్ లో ప్రభాస్ ఇతర యంగ్ హీరోల్లో ఒక హీరో. కాని ఎప్పుడైతే బాహుబలి చిత్రాన్ని చేశాడో టాలీవుడ్ స్టార్ హీరోల కంటే చాలా మెట్లు పైకి వెళ్లి పోయాడు. బాలీవుడ్ స్టార్ హీరోల స్థాయిలో ఈయనకు గుర్తింపు దక్కింది. బాహుబలి తర్వాత హిందీ లో ఈయనకు భారీ పారితోషికం ఇచ్చి మరీ ప్రముఖ నిర్మాతలు సినిమాలు చేసేందుకు ముందుకు వచ్చారంటే ఈయన క్రేజ్ ను అర్థం చేసుకోవచ్చు. ఇండియన్స్ ఏ దేశంలో ఉన్నా కూడా ప్రభాస్ ను గుర్తించి ఇబ్బంది పెడుతున్నారట.తాజాగా ఒక ఇంటర్వ్యూ లో ప్రభాస్ మాట్లాడుతూ.. తాను ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోని ఏ ప్రముఖ నగరానికి వెళ్లినా కూడా సెల్ఫీలని మీద పడేస్తున్నారని చెప్పుకొచ్చాడు. తాను ఎక్కడ కూడా ప్రశాంతంగా ఉండలేక పోతున్నానని తన వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలుగుతుందని చెప్పుకొచ్చాడు. కొన్ని సార్లు ఇది బాగానే అనిపించినా ప్రతి సారి కూడా తనకు స్వేచ్చ లేకుండా పోవడంతో చిరాకుగా అనిపిస్తుందని ఈ సందర్బంగా ప్రభాస్ చెప్పుకొచ్చాడు.

అందుకే నేను బయటకు వెళ్లేందుకు మాస్క్ ను వాడుతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. బయటకు వెళ్లిన సమయంలో ధరించేందుకు నా వద్ద 50 బ్యాండనాస్ లు 60 క్యాప్ ల వరకు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. అవి లేకుండా బయటకు వెళ్లలేని పరిస్థితి. అవి ధరిస్తే తప్ప నేను బయట స్వేచ్చ గా తిరుగలేక పోతున్నట్లుగా ప్రభాస్ నవ్వుతూ అన్నాడు. విదేశాల్లో కూడా బ్యాండనాస్ లతోనే బయట తిరుగుతున్నట్లుగా చెప్పాడు.

ప్రస్తుతం ఈయన సాహో చిత్రం తో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఆ రెండు వచ్చే ఏడాదిలో విడుదల అయ్యే అవకాశాలున్నాయి. ఆ చిత్రాలను కూడా హిందీ లో భారీగా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఆ చిత్రాలతో ప్రభాస్ క్రేజ్ మరింతగా పెరుగుతుందేమో చూడాలి.