సైబర్ క్రైమ్ స్పందించాలంటున్న హైపర్ ఆది

Mon Apr 16 2018 22:03:05 GMT+0530 (IST)

శ్రీ రెడ్డి వివాదం ఎటు నుంచి ఎక్కడికి పోతుందో ఎవ్వరికి అర్థం కావడం లేదు. మొదట తనని వేదించారంటూ మీడియా ముందు కూర్చున్న ఆమె ఆ తరువాత మహిళ సంఘాలతో భేటీలు జరిపి ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి బాగానే తెలిపింది. ఆడవాళ్లకు ఇంత కష్టం ఉందా అని ఎమోషనల్ గా చాలా మంది కనెక్ట్ అయ్యారు. మహిళలు మొత్తం ఆమె వెంట నడిచారు. సోషల్ మీడియాలో కూడా సపోర్ట్ అందింది.కానీ రీసెంట్ గా పవన్ ఆమెపై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలకు శ్రీ రెడ్డి ఇచ్చిన సమాధానం అభిమనులను కలవరపెడుతోంది. పవన్ కళ్యాణ్ అన్న కాదు.. వాడు 'మా.....' అంటూ తిట్టేసింది శ్రీరెడ్డి. ఆగ్రహంతో ఊగిపోయే అభిమానులు మొదటిసారి సోషల్ మీడియా ద్వారా సైబర్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తల్లిని అసభ్యంగా తిట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ గారు మీ సమస్యలు ఏమైనా ఉంటే పోలీస్ లకి ఫిర్యాదు చేయమంటే శ్రీ రెడ్డి గారు ఓక స్త్రీ అయ్యి ఉండి బూతులు మాట్లాడటం అసభ్య చిహ్నాలని చూపించడం వల్ల అభిమానులలో ఆవేశం పెరిగి నోరు జారితే దానికి బాద్యత ఎవరు వహిస్తారు అని ట్వీట్ చేస్తున్నారు.

హైపర్ అది కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ కి ట్వీట్ చేశాడు. ఆడవాళ్లు అయినా మగవాళ్లు అయినా ఒకే చట్టం. పబ్లిక్ గా అంతటి ఒక యూత్ లీడర్ ని  వాళ్ల అమ్మ గారిని అభ్యుస్ చేస్తూ మాట్లాడినా..మీరు రియాక్ట్ అవకపోతే ఆది మన ఫెయిల్యూర్ ఆవుతుంది... దయచేసి రెస్పాండ్ అవ్వండని ఆది వివరించారు.