Begin typing your search above and press return to search.

వామ్మో.. ‘హైపర్’కు అంత రేటా?

By:  Tupaki Desk   |   28 Sep 2016 1:30 PM GMT
వామ్మో.. ‘హైపర్’కు అంత రేటా?
X
హైపర్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్.. టీజర్ చూస్తే మరీ సాదాసీదాగా అనిపించాయి. రొటీన్ సినిమాలతో ఒకప్పుడు వరుసగా ఎదురు దెబ్బలు తిని.. ఆ తర్వాత ‘నేను శైలజ’తో ట్రాక్ ఎక్కిన రామ్.. మళ్లీ పాత బాటలోనే నడుస్తున్నాడేంటని విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. ఐతే కమర్షియల్ సినిమాల్ని ఇష్టపడే ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద ఆసక్తి బాగానే ఉంది. బయ్యర్లు కూడా ఈ సినిమాపై బాగానే ఆసక్తి చూపించారు. ‘హైపర్’కు రూ.15 కోట్లకు పైనే బిజినెస్ కూడా జరిగింది. అంతే కాక.. విడుదలకు ముందే దీని హిందీ హక్కులు రూ.2 కోట్లకు అమ్ముడవడం విశేషం. ‘హైపర్’ శాటిలైట్ రైట్స్ గురించి వినిపిస్తున్న తాజా కబురు వింటే దిమ్మదిరగడం ఖాయం.

‘హైపర్’ శాటిలైట్ హక్కుల్ని జీ తెలుగు ఛానెల్ రూ.6.3 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. రామ్ రేంజికి పోలిస్తే ఇది చాలా పెద్ద మొత్తమే. స్టార్ హీరోలకు మాత్రమే ఈ రేటు పలుకుతుంది. ‘హైపర్’ మీద ఉన్న పాజిటివ్ బజ్ చూసి.. రామ్ సహా టీమ్ సభ్యుల కాన్ఫిడెన్స్ చూసి జీ తెలుగు వాళ్లు ధైర్యం చేసినట్లున్నారు. రామ్ సినిమాల్లో శాటిలైట్ రైట్స్ పరంగా ఇది రికార్డు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘కందిరీగ’ తర్వాత రామ్-సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ఇది. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’లో మళ్లీ ఫామ్ అందుకున్న 14 రీల్స్ సంస్థ ‘హైపర్’ను నిర్మించింది. రామ్ సరసన రాశి ఖన్నా నటించిన ఈ సినిమాలో కీలకమైన తండ్రి పాత్రను సత్యరాజ్ పోషించాడు. ఈ శుక్రవారమే ‘హైపర్’ ప్రేక్షకుల ముందుకొస్తుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/