Begin typing your search above and press return to search.

పీక్ పబ్లిసిటీ.. హ్యాట్రిక్ కొట్టేసింది

By:  Tupaki Desk   |   22 July 2016 10:30 PM GMT
పీక్ పబ్లిసిటీ.. హ్యాట్రిక్ కొట్టేసింది
X
సినిమాలో కంటెంట్ కి తగినట్లుగా కాకుండా.. పబ్లిసిటీతో సినిమాని పీక్స్ కి తీసుకెళ్లి పోవడం ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. రీసెంట్ మూవీ కబాలి దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. టీజర్ - ప్రోమోలని హైఎండ్ ఎనర్జీతో కట్ చేసి.. మాంచి మాస్ మూవీ అనే బిల్డప్ తో.. సూపర్ స్టార్ కబాలి రిలీజ్ చేశారు.

దొరికిన ప్రతీ కంపెనీతో బ్రాండింగ్ చేసే సరికి ఆయా కంపెనీలు హైఎండ్ ప్రమోషన్స్ చేశాయి. తీరా సినిమా చూస్తే క్లాసిక్ కి దగ్గరగా ఉండడం నిరుత్సాహం కలిగించింది. ఇప్పటికిప్పుడే ఇది ఫ్లాప్ అని చెప్పడానికి లేకపోయినా.. ఇంకో మూడ్రోజుల తర్వాతయినా ఇదే మాట చెప్పాల్సి వస్తుంది. దీనికి ముందు మహేష్ మూవీ బ్రహ్మోత్సవంకి కూడా ఇలాగే పబ్లిసిటీ చేశారు. అక్కడ కూడా ఆయిల్ కంపెనీలు.. చెప్పుల కంపెనీలు బ్రాండింగ్ కి దిగాయి. తీరా సినిమా మాత్రం తేడా కొట్టేసింది. ఇక్కడ కూడా స్లో నేరేషన్ పెద్ద సమస్య అని టాలీవుడ్ ఆడియన్స్ కి చెప్పాల్సిన పనిలేదు.

ఈ రెండింటికి ముందు పవన్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ కూడా.. పీక్ స్టేజ్ కి చేరిన పబ్లిసిటీతో గట్టి దెబ్బనే తినింది. సర్దార్ విషయంలో మాత్రం.. సినిమా స్టోరీ ఏంటో ముందే చెప్పి థియేటర్లకు రప్పించినా ఫెయిల్యూర్ తప్పలేదు. కంటెంట్ సరిగా లేకపోయినా పబ్లిసిటీతో హిట్ కొట్టేయచ్చనే కాన్సెప్ట్ ఏ రేంజ్ లో ఫెయిల్యూర్ అవుతుందో.. సర్దార్ - బ్రహ్మోత్సవం - కబాలిల హ్యాట్రిక్ ఫెయిల్యూర్స్ నిరూపిస్తాయి.