Begin typing your search above and press return to search.

బెంగుళూరు గెలవలేదని మనోళ్లు ఫీలయ్యారు

By:  Tupaki Desk   |   30 May 2016 1:30 PM GMT
బెంగుళూరు గెలవలేదని మనోళ్లు ఫీలయ్యారు
X
నిన్న చాలామంది టాలీవుడ్‌ సెలబ్రిటీలు హైదరాబాద్‌ లోని అప్‌ మార్కెట్‌ కాఫీ షాపుల్లో.. చక్కగా ఒక చల్లటి మగ్‌ బీరు లాగిస్తూ.. ఐపిఎల్‌ 9వ ఎడిషన్‌ ఫైనల్‌ తిలకించారు. అలాంటి కాఫీ షాపుల్లో ఒక కత్తి లాంటి డిస్కషన్‌ ఒకటి చోటుచేసుకుంది.

అందరూ సన్ రైజర్స్ హైదరాబాద్‌ గెలవాలనే కోరుకుంటున్నా కూడా.. అక్కడక్కడా కొందరు మాత్రం బెంగుళూరు గెలవాలంటూ వీలలూ అరుపులూ వేశారు కూడా. పైగా 140 పరుగుల వరకు కోహ్లీ సేన ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా చితక్కొట్టేయడంతో.. వీరి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయ్‌. ఆ తరువాత బౌలర్‌ కట్టింగ్‌ ఇచ్చిన కటింగ్‌ తో వీరికి మతిపోయింది. కాని వీళ్ళు బెంగుళూరు టీమును ఇంతగా సపోర్టు చేయడానికి ఒక లాజిక్‌ ఉందట.

కొందరు ఏమంటున్నారంటే.. హైదరాబాద్‌ మన సొంత టీమ్‌ అయినప్పటికీ.. దాని ఓనర్లు తమిళ వారు.. అలాగే ఆ టీమ్‌ కెప్టెన్ డేవిడ్‌ వార్నర్‌ ఒక ఆస్ట్రేలియన్‌. సో.. సన్ రైజర్స్ గెలిస్తే.. ఏ విధంగానూ వీరికి మనశ్శాంతి అనేది ఉండదట. అదే బెంగుళూరు గెలిస్తే.. దాని ఓనర్లు కన్నడకు చెందిన లోకల్ వారే.. అలాగే కెప్టెన్ సాక్షాత్తూ విరాట కొహ్లీ. ఎవరో పరాయి దేశస్తుడు మన కప్పును ఎత్తడం ఏంటి.. ఇది ఇండియాలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ కాబట్టి.. దీనిని ఒక ఇండియన్‌ గెలిస్తేనే బాగుంటుంది అనేది వీరి కోరిక. తప్పులేదు. ఎవరి కోరికలు వారివి.

కాని చివరకు హైదరాబాద్‌ టీమే గెలిచింది. కప్పు గెలిచిన హైదరాబాదీలు ఏమంటున్నారంటే.. అసలు వేరే దేశంకు చెందిన ఒక వ్యక్తి మన చొక్కా వేసుకుని.. మన ఊరి తరుపున ఆడుతున్నాడంటే.. అదే మన ఊరికి మన మనుషులకు చాలా గర్వకారణం కదండీ అంటున్నారు. పైగా రైవల్ ఆస్ర్టేలియా నుండి వచ్చి.. ఇండియన్ జెండాను నెత్తినేసుకుని.. హైదరాబాద్‌ మినార్‌ మోస్తున్నాడు. రెస్పెక్ట్ వార్నర్‌.. అంటూ చెప్పుకొచ్చారు. అది సంగతి.