Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: అంతా చెడు మయం

By:  Tupaki Desk   |   21 Oct 2018 10:59 AM GMT
ట్రైలర్ టాక్: అంతా చెడు మయం
X
టైటిల్ కింద ట్యాగ్ లోనే సెలబ్రేషన్ అఫ్ బ్యాడ్ బిహేవియర్ అంటూ కాన్సెప్ట్ ని చెప్పకనే చెప్పిన హుషారు సినిమా ట్రైలర్ ఇప్పుడు యూత్ లో టాక్ గా మారింది. దీనికి కారణం లేకపోలేదు. ఇలాంటి థీమ్ తో గతంలో చాలా సినిమాలు వచ్చినా ఇందులో చూపించిన అంశాలు మాత్రం కాస్త బోల్డ్ గా ఇంకా చెప్పాలంటే పచ్చిగా ఉండటమే. ఎలాంటి లక్ష్యం లేకుండా జీవితాన్ని జాలీగా గడిపే నలుగురు కుర్రాళ్ళు. మందు లేకుండా రోజు గడవదు. అందులో భాగంగానే కష్టాలు. చుక్క మందు కోసం కష్టాలు పడే పరిస్థితి. ఇలా అయితే లాభం లేదని ఏదేదో ప్రయోగాలూ చేసి స్వంతంగా వీళ్ళే ఒక బీరు కనుక్కుని ఆన్ లైన్ అత్యంత చవకగా అమ్మడం మొదలుపెడతారు. కట్ చేస్తే వ్యవహారం పోలీసుల దాకా వెళ్తుంది. వీళ్ళకు ఒక కంపెనీలో పనిచేసే ఫ్రస్ట్రేటింగ్ ఎంప్లాయ్ రాహుల్ రామకృష్ణ తోడవుతాడు. వీళ్ళందరూ కలిసి సిటీని బీరు మయం చేద్దాం అనుకున్న ప్రయత్నం ఎక్కడి దాకా వచ్చింది బ్యాడ్ బిహేవియర్ వీళ్ళను ఎక్కడి దాకా తీసుకెళ్ళింది అనేదే కథగా కనిపిస్తోంది.

ట్రైలర్ పూర్తిగా యూత్ ని టార్గెట్ చేసి ఉంది. కాకపోతే మందు కొట్టడం యువత జీవితంలో అతి ముఖ్యమైన లేదా సాధారణమైన ఘట్టంగా చూపించడం ఈ మధ్య వస్తున్న సినిమాల ట్రెండ్ కు ఇంకాస్త బలం చేకూర్చేలా ఉంది. సినిమా మొత్తంలో తెలిసిన మొహం ఒక్క రాహుల్ రామకృష్ణది మాత్రమే ఉంది. తేజుస్ కంచెర్ల-తేజ్ కుర్రపాటి-దినేష్ తేజ్-అభినవ్ మేదిశెట్టి ఆ నలుగురిగా సహజంగానే హైదరబాద్ యూత్ లాగా బాగా సరిపోయారు. దక్ష-ప్రియ-హేమల్-అంజల్ హీరొయిన్ల బ్యాచ్ ఉంది కాని ఎవరిని ఇందులో ఎక్కువగా హై లైట్ చేయలేదు. శ్రీహర్ష పానుగంటి దర్శకత్వం వహించిన ఈ మూవీకి అర్జున్ రెడ్డికి ట్యూన్స్ ఇచ్చిన రధన్ సంగీతం అందించడం మరో ఆకర్షణ. యూత్ ని ప్రత్యేకంగా టార్గెట్ చేసిన ఈ బ్యాడ్ బిహేవియర్ మూవీ టైటిల్ కు తగ్గట్టే ఉంటుందా లేక ప్రెజెంటేషన్ లో గుడ్ అనిపించుకుంటుందా వేచి చూడాలి