Begin typing your search above and press return to search.

'హ‌మ్మా'..యూట్యూబ్‌ ను ఊపేస్తోంది!

By:  Tupaki Desk   |   21 Jun 2017 1:21 PM GMT
హ‌మ్మా..యూట్యూబ్‌ ను ఊపేస్తోంది!
X
మ‌ణిర‌త్నం బొంబాయి సినిమాలోని హ‌మ్మా... పాట అప్ప‌ట్లో దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. ఆ పాట‌తో కుర్ర‌కారును గిలిగింత‌లు పెట్టించాడు ఏఆర్ రెహ‌మాన్‌. అయితే, ఆ హిట్ సాంగ్‌ను తాజాగా ఓ బాలీవుడ్ సినిమా కోసం రీమిక్స్ చేశాడు రెహ‌మాన్‌. యూట్యూట్‌లో ఆ పాట‌కు 20 కోట్ల వ్యూస్ వ‌చ్చాయి. ఆ పాట బంప‌ర్ హిట్ అయినా, సినిమా మాత్రం అట్ట‌ర్ ఫ్లాప్ అయింది.

రెండేళ్ల కిందట తమిళం, తెలుగు భాషల్లో మంచి విజయం సాధించిన ‘ఓకే బంగారం’ చిత్రాన్ని హిందీలో నిర్మించారు. మణిరత్నం శిష్యుడు షాద్ అలీ ‘ఓకే జాను’ పేరుతో ఆ చిత్రాన్ని రీమేక్ చేశాడు.‘ఆషికి-2’ జంట సిద్దార్థ్ రాయ్ కపూర్-శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజైంది.

అయితే, ఉత్త‌రాదిలో ‘ఓకే జాను’ అట్టర్ ఫ్లాప్ అయింది. విజువల్స్, మ్యూజిక్ విషయంలో మంచి ఫీడ్ బ్యాక్ వచ్చినా.. సినిమా మాత్రం తేలిపోయింది. అయితే, ‘ఓకే జాను’లో ‘హమ్మా హమ్మా.. పాట యూట్యూబ్‌లో కళ్లు చెదిరే రికార్డు నమోదు చేసుకోవ‌డం చిత్ర యూనిట్‌కు కొంత సంతోషాన్నిచ్చింది.

తెలుగులో ‘మత్తేదో చల్లెనే..’ అంటూ సాగే పాట స్థానంలో ఈ పాట పెట్టారు. తెలుగుతో పోలిస్తే.. కొంచెం మ‌సాలా డోస్ పెంచారు. గత ఏడాది నుంచి యూట్యూబ్‌ లో పెట్టే ప్రతి సినిమా వీడియోకూ భారీగానే వ్యూస్ వస్తున్నాయి. కానీ.. ఒక పాటకు ఏకంగా 20 కోట్ల వ్యూస్ అన్నది మాత్రం సాధార‌ణ విష‌యం కాదు క‌దా!.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/