Begin typing your search above and press return to search.

థియేట‌ర్ మేనేజ‌ర్లే కింగ్ మేక‌ర్లు

By:  Tupaki Desk   |   24 April 2017 4:29 PM GMT
థియేట‌ర్ మేనేజ‌ర్లే కింగ్ మేక‌ర్లు
X
ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లోనే ఏ చిత్రానికీ లేని స్థాయిలో అంచ‌నాలున్నాయి ‘బాహుబ‌లి: ది కంక్లూజ‌న్’ మీద‌. ఈ సినిమా టికెట్ సాధిస్తే.. అదో పెద్ద ఘ‌న‌తగా భావించే ప‌రిస్థితి. ఇప్ప‌టికే ఆన్ లైన్ బుకింగ్స్ ఓపెన‌వ‌గా.. టికెట్లు హాట్ కేకుల్లా అయిపోతున్నాయి. అస‌లు ఎవ‌రు కొంటున్నారో తెలియ‌దు. వెబ్ సైట్ ఓపెన్ చేయ‌గానే టికెట్లు అయిపోయిన‌ట్లే క‌నిపిస్తోంది. ఇక థియేట‌ర్ల ద‌గ్గ‌రికెళ్లినా ఫ‌లితం ఉండ‌ట్లేదు. దీంతో టికెట్ ఎలా ద‌క్కించుకోవాలో తెలియ‌క అయోమ‌యంలో ప‌డిపోతున్నారు జ‌నాలు. సామాన్యుల ద‌గ్గ‌ర్నుంచి సొసైటీలో ఒక స్థాయి ఉన్న‌వాళ్ల‌కు కూడా బాహుబ‌లి-2 టికెట్ సాధించ‌డం పెద్ద స‌వాలుగా మారే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు థియేట‌ర్ల మేనేజ‌ర్లే కింగ్ మేక‌ర్లు కాబోతున్నారు.మ‌రో ప‌ది రోజుల పాటు వాళ్ల మొబైల్స్ అదే ప‌నిగా మోగ‌బోతున్నాయి. రాజ‌కీయ నేత‌లు.. సినిమా వాళ్లు.. సొసైటీలో ప్ర‌ముఖులంద‌రూ ఇప్పుడు థియేట‌ర్ల మేనేజ‌ర్ల మీదే ప‌డ‌బోతున్నారు. ఇప్ప‌టికే మేనేజ‌ర్ల‌పై టికెట్ల కోసం విప‌రీత‌మైన ఒత్తిడి వ‌స్తోంద‌ట‌. వాళ్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి.. టికెట్లు సంపాదించ‌డానికి గ‌ట్టి ప్ర‌య‌త్నాలే జ‌రుగుతున్నాయి. ఐతే డిమాండుకు త‌గ్గ‌ట్లు టికెట్లు ఇవ్వ‌డం థియేట‌ర్ల మేనేజ‌ర్ల‌కు కూడా సాధ్య‌మ‌య్యే ప‌ని కాదు. ఈ డిమాండును దృష్టిలో ఉంచుకుని బోలెడంత సంపాదించుకోవ‌డానికి ఇది మంచి అవ‌కాశంగా కూడా మేనేజ‌ర్లు భావిస్తున్నారు. బాహుబ‌లి-2 థియేట్రిక‌ల్ ర‌న్ ముగిసేలోపు చాలామంది మేనేజ‌ర్లు మంచి ఆదాయంతో పాటు ప‌లుకుబ‌డి కూడా సంపాదించే అవ‌కాశ‌ముంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/