Begin typing your search above and press return to search.

కాంట్రోవర్శీలతో భారీ బుక్కింగ్స్

By:  Tupaki Desk   |   23 Aug 2017 5:46 AM GMT
కాంట్రోవర్శీలతో భారీ బుక్కింగ్స్
X
ఈ శుక్రవారం రిలీజ్ కాబోతున్న విజయ్ దేవరకొండ-అర్జున్ రెడ్డి ఎలా ఉండబోతోందో తెలియదు గాని ఆ సినిమా మాత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. ప్రస్తుతం యూత్ అయితే ఈ సినిమాను ఎప్పుడు చూస్తామా అని కళ్ళు కాయలు కచేలా ఎదురు చూస్తున్నారు. ఎక్కడ చూసినా ఆ సినిమా గురించే మాట్లాడుతూ సినిమా చూడటానికి తెగ ఇష్టపడుతున్నారు. నిజానికి ఈ రేంజు క్రేజుకు టీజ్ అండ్ ట్రైలర్ ఒక కారణం అయితే.. కాంట్రోవర్శీలు మరో కారణం. ఇప్పుడు వివాదాల కారణంగా ఏకంగా గురువారం రాత్రి వేసే ప్రీమియర్లకు కూడా టిక్కెట్లు గట్టిగానే తెగాయ్.

ఈ సినిమాపై కాంట్రవర్సీలు ఓ రేంజులో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఓ బస్సుపై ఉన్న అర్జున్ రెడ్డి పోస్టర్ ని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు చించెయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు విహెచ్ పై సెటైర్ వేసి.. హీరో అయితే ఏకంగా 'చిల్ తాత' అని రాసి ఇంకా హాట్ టాపిక్ గా మార్చాడు. ఇక విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా వ్.హనుమంతరావు చేసిన పనికి తనదైన శైలిలో సెటైర్ వేసి అందరిని మరోసారి ఆకర్షించారు. ఒక అందమైన అమ్మాయికి ముద్దు ఇస్తుంటే విహెచ్ కి అంత ఈర్ష్య ఎందుకని చెబుతూ.. పోస్టర్ ని చించేసిన ఆయన దుస్తులను కూడా చించేయలని కామెంట్ చేశాడు.

అలాగే దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా దాసరి నారాయణరావు బ్రతికుంటే తెలుగు ఇండస్ర్టీకి జి.ఎస్.టి సమస్య ఉండేది కాని.. బాక్సుల్లో మగ్గుతున్న ఎన్నో సినిమాలను రిలీజ్ చేయలేకపోతున్నారు.. అర్జున్ రెడ్డి లక్కీగా ఏసియన్ ఫిలింస్ వారు ఆదుకోవడంతో బయటపడిందని కామెంట్ చేశారు. అది మరో వివాదంగా మారుతోంది. అసలు సినిమా కోసం చేసే పబ్లిసిటీ ఒకటైతే.. ఇలా వివాదాలతో చేసే పబ్లిసిటీ ఒకటి. వెరసి సినిమాకు ఉపయోగపడుతున్నాయి. కాని పెరుగుతున్న హైప్ వలన సినిమా కంటెంట్లో ఏమాత్రం తేడా కొట్టినా ఫాస్టుగా ఫ్లాపు కూడా కొట్టేసే ఛాన్సుంది.