Begin typing your search above and press return to search.

క్రిష్ కి మరో షాక్ తప్పదా!

By:  Tupaki Desk   |   22 Jan 2019 4:14 PM GMT
క్రిష్ కి మరో షాక్ తప్పదా!
X
మరో మూడు రోజుల్లో మణికర్ణిక తెరపైకి రానుంది. తొలుత క్రిష్ దర్శకత్వం వహించి మధ్యలో బయటికి వచ్చాక మిగిలింది కంగనా తన చేతుల్లోకి తీసుకుని పూర్తి చేసింది. అయితే కథను వక్రీకరించారని అందుకే సోను సూద్ తో పాటు తాను కూడా తప్పుకున్నానని క్రిష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. మరో ముఖాముఖిలో కథకులు కం పర్యవేక్షకులు విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కంగనా సీనియర్ దర్శకులకు ఏ మాత్రం తీసిపోని రీతిలో బాధ్యతలు మోసిందని అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని ఓ రేంజ్ లో పొగిడేశారు.

ఇప్పుడు ఎవరి మాట నిజమో తెలియాలంటే శుక్రవారం దాకా ఆగాల్సిందే. అయితే మణికర్ణికకు సంబంధించి ఎలాంటి సందడి కాదు కదా కనీసం మినిమం బజ్ కూడా కనిపించడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో నత్తనడకతో ఇవాళ మధ్యాన్నం నుంచి ఓపెన్ కాగా తెలుగు వెర్షన్ ఇంకా పెట్టనే లేదు. పోనీ నార్త్ లో మంచి క్రేజ్ ఉందా అంటే నవాజుద్దీన్ సిద్ధిక్ నటించిన థాకరేకె ఎక్కువ క్రేజ్ కనిపిస్తోంది. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే కథ కావడంతో అక్కడ భారీ వసూళ్లు వచ్చేలా ఉన్నాయి. ఒకరకంగా ఇది ప్రభావం చూపించేదే.

ఇక తెలుగులో మిస్టర్ మజ్ను ఒకటే ఉన్నప్పటికీ యూత్ మొత్తం దాని వైపే ఉన్నారు. పాజిటివ్ టాక్ వచ్చిందా కొత్త సినిమాలేవీ లేవు కాబట్టి నిలిచే ఛాన్స్ ఉంది. ఎఫ్2 ఇంకా స్ట్రాంగ్ గానే ఉంది. సో మణికర్ణిక ఈ అడ్డంకులన్నీ దాటుకుని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా కంగనాతో పాటు క్రిష్ కూడా ఫలితాన్ని పంచుకోవాల్సిందే. అదే జరిగితే ఒకే నెలలో రెండు డిజాస్టర్లు అందుకున్న రిమార్క్ క్రిష్ కు వస్తుంది. అందుకే ఇది కనీసం ఆడటం చాలా అవసరం.హైదరాబాద్ కు వచ్చి ఓ ప్రమోషన్ ఈవెంట్ చేయడం తప్ప కంగనా టీం చేసింది ఏమి లేదు. మరి బాక్స్ ఆఫీస్ పరీక్షని వీరనారి తట్టుకుంటుందా. చూద్దాం