Begin typing your search above and press return to search.

బీచ్ నగరంలో భరత్ హంగామా

By:  Tupaki Desk   |   19 March 2018 10:11 AM GMT
బీచ్ నగరంలో భరత్ హంగామా
X
భారీ సినిమాల ప్రీ రిలీజ్ ఆడియో వేడుకల వేదిక క్రమంగా హైదరాబాద్ నుంచి వైజాగ్ కు షిఫ్ట్ అవుతున్నట్టు కనిపిస్తోంది. నిన్న రామ్ చరణ్ రంగస్థలం ప్రీ రిలీజ్ వేడుక అక్కడే ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేష్ బాబు భరత్ అనే నేను ఫంక్షన్ కూడా అక్కడే చేసేలా నిర్మాత డివివి దానయ్య ప్లాన్ చేస్తున్నట్టు తాజా సమాచారం. బ్రహ్మోత్సవం, స్పైడర్ తర్వాత వస్తున్న మూవీ కనక మహేష్ ఫాన్స్ ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. మాస్ పల్స్ ని పసిగట్టడంలో ఎక్స్ పర్ట్ గా పేరు తెచ్చుకున్న కొరటాల శివ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఏ మాత్రం వమ్ము చేయలేదని టీజర్ లోనే అర్థమైపోయింది. ప్రీ రిలీజ్ టాక్ చాలా పాజిటివ్ గా ఉన్న భరత్ అనే నేను త్వరలోనే వైజాగ్ లో హంగామా చేయటం ఖాయంగా కనిపిస్తోంది.

రెగ్యులర్ వేదికలకు భిన్నంగా సినిమా థీమ్ ని ప్రతిబింబించేలా స్టేజి మొత్తం అసెంబ్లీ తరహాలో ప్రత్యేక సెట్ వేసి సెషన్స్ జరుగుతున్నప్పుడు ఏదైతే వాతావరణం ఉంటుందో అలాంటిదే సృష్టించి చాలా విభిన్నంగా జరిపే ఆలోచన ఉందని టాక్. దేవి శ్రీ ప్రసాద్ లైవ్ పెర్ఫార్మన్స్ కూడా ఇందులో భాగంగా ఉండబోతోంది. ఈ ఒక్క స్టేజి సెట్టింగ్ కోసమే దాదాపు అర కోటి ఖర్చు పెట్టబోతున్నట్టు సమాచారం. ఈ మధ్య కాలంలో తెలుగులో ఏ సినిమాకూ ఇంత భారీగా వేడుక జరిపింది లేదు. ఆ రకంగా స్పెషల్ గా డిజైన్ చేసి మహేష్ ఫాన్స్ ఎప్పటికి మర్చిపోలేని గొప్ప ఈవెంట్ గా దీన్ని తీర్చిదిద్దబోతున్నట్టు వినికిడి. డేట్ మరో రెండు మూడు రోజుల్లో ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి.

ఏప్రిల్ 20 రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న భరత్ అనే నేను బిజినెస్ కూడా ఫుల్ స్వింగ్ మీద ఉంది. అధికారికంగా లెక్కలు బయటికి చెప్పకపోయినా మహేష్ కెరీర్ బెస్ట్ ఫిగర్స్ నమోదు అయ్యే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాల అంచనా. కైరా అద్వాని హీరొయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఆడియో ట్రాక్స్ ఈ వారం నుంచే విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.