Begin typing your search above and press return to search.

సూర్యకాంతంకు భలే లక్కీ ఛాన్స్

By:  Tupaki Desk   |   24 March 2019 5:03 AM GMT
సూర్యకాంతంకు భలే లక్కీ ఛాన్స్
X
మెగా డాటర్ గా తెరకు పరిచయమైన నీహారిక సినిమాలైతే చేస్తోంది కానీ ఇప్పటిదాకా సక్సెస్ అందుకోలేదు. ఈ నెల 29న సూర్యకాంతంతో మరోసారి పలకరించనుంది. నిన్న విజయ్ దేవరకొండ ముఖ్య అతిధిగా జరిగిన వేడుక కొంత హైప్ తీసుకురావడంలో తోడ్పడింది. ఎన్నికల వాతావరణం వేడిగా ఉన్న తరుణంలో జనాలు సినిమాలు చూసే మూడ్ లో ఉన్నారా అనే అనుమానాల మధ్యే ఇది రిలీజ్ అవుతుండటం విశేషం.

అయితే సరిగ్గా వాడుకోవాలే కానీ సూర్యకాంతంకు చాలా విషయాలు కలిసి వస్తున్నాయి. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అదే డేట్ ని లాక్ చేసుకున్నప్పటికీ ఇప్పటిదాకా సెన్సార్ పూర్తి కాలేదు. రేపు లేదా ఎల్లుండి అంటున్నారు. ఆపై చేతిలో రెండు రోజులు టైం మాత్రమే ఉంటుంది. ఎంత ప్లానింగ్ తో ఉన్నా సెన్సార్ జరిగిన అంత తక్కువ సమయంలో విడుదల చేయడం దాదాపు అసాధ్యం

ఇక నిఖిల్ అర్జున్ సురవరం కూడా ఇంతకు ముందు ఇదే డేట్ ఫిక్స్ చేసుకుంది. తీరా ఇతర కారణాల వల్ల ఏకంగా మే 1కు వెళ్లిపోయింది. నిఖిల్ మూవీ కాబట్టి బరిలో ఉంటే ఖచ్చితంగా ప్రభావం ఉండేది. ఇక అల్లు శిరీష్ ఎబిసిడి సైతం తేదీలు మార్చుకుంటూ వచ్చి ఇప్పటికీ క్లారిటీ లేక బెస్ట్ డేట్ కోసం వేటలో ఉంది. సో ఇలా కీలకమైన పోటీ పక్కకు తప్పుకోవడంతో సూర్యకాంతం సోలోగా బాక్స్ ఆఫీస్ లో అడుగు పెట్టె ఛాన్స్ దక్కింది. ఓపెనింగ్స్ మరీ ఘనంగా రాకపోయినా కంటెంట్ గురించి టాక్ పాజిటివ్ గా వస్తే చాలు ఒకటి రెండు రోజుల్లో పికప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ సూర్యకాంతం ఈ అవకాశాన్ని ఎంత వరకు వాడుకుంటుందో చూడాలి