హృదయం జరిపే.. అంటున్న శర్వా

Thu Dec 06 2018 22:36:20 GMT+0530 (IST)

శర్వానంద్ - సాయి పల్లవి మొదటిసారి జోడీగా నటిస్తున్నచిత్రం 'పడిపడి లేచే మనసు'.  హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 21 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ విషయంలో జోరు పెంచిన టీమ్ ఈ సినిమానుండి లిరికల్ సాంగ్స్ వరసగా రిలీజ్ చేస్తూవస్తున్నారు. తాజాగా ఈ సినిమానుండి 'హృదయం జరిపే' అంటూ సాగే పాటను విడుదల చేశారు.ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.  హృదయం జరిపే.. పాటకు సాహిత్యం అందించిన వారు కృష్ణకాంత్.  "నువు నడిచే ఈ నేల పైనే నడిచానా ఇన్నాళ్ళుగానే.." అంటూ మొదలై..  "నా ఇన్నాళ్ళ సంకెళ్ళనే హృదయం జరిపే తొలి తిరుగుబాటిది" అంటూ సాగే లిరిక్స్ డిఫరెంట్ గా ఉన్నాయి.  దానికి తగ్గట్టే ట్యూన్.. సింగర్ యాజిన్ నిజార్ గానం ఉండడం విశేషం.   ఓవరాల్ గా మ్యూజిక్ లవర్స్ ను మెప్పించే పాటే ఇది.

ఈ సినిమాలో శర్వా- సాయి పల్లవి మధ్యలో ఉండే కెమిస్ట్రీ ఇప్పటికే సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ సాంగ్ శర్వా లవ్ లో పడిన తర్వాత ఒక ఫీల్ తో పాడే పాట కావడంతో మాంటేజ్ సాంగ్ లా ఉండే విజువల్స్ పాటను మరింత అందంగా మార్చాయి.  ఇద్దరూ టాలెంటెడ్ హీరో హీరోయిన్లు ఒకరి లవ్ లో మరొకరు పడి..ఆడియన్స్ అందరినీ వారిద్దరి లవ్ లో పడేసేలా ఉన్నారే.. మీరు పడకుండా ట్రై చెయ్యండి.. జాగ్రత్తగా పాటను చూడండి.