Begin typing your search above and press return to search.

ఈసారి చెవిటి మూగ రెజ్లర్ గా వస్తాడట

By:  Tupaki Desk   |   24 Jan 2017 5:31 AM GMT
ఈసారి చెవిటి మూగ రెజ్లర్ గా వస్తాడట
X
ఈ నెల 25న కాబిల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్. ఈ చిత్రంలో అంధుడిగా నటిస్తూ.. ఓ ప్రయోగం చేస్తున్నాడీ హీరో. కమర్షియల్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నా.. గుడ్డివాడి పాత్రను హృతిక్ లాంటి స్టార్ చేయడం అంటే.. పెద్ద ప్రయోగం అనాల్సిందే.

దీని తర్వాత కూడా మరో ఎక్స్ పెరిమెంట్ చేసేందుకు సిద్ధం అవుతున్నాడట హృతిక్ రోషన్. ఈ సారి చెవిటి-మూగ పాత్రలో కనిపించాలని భావిస్తున్నాడట. కాకపోతే.. ఇది ఓ రెజ్లర్ పాత్ర కావడం విశేషం. సుల్తాన్ లో సల్మాన్ ఖాన్.. దంగల్ లో ఆమిర్ ఖాన్ లు రెజ్లర్ పాత్రలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. అలాంటిదే గూంగా పహిల్వాన్ గా పిలుచుకునే వీరేంద్ర సింగ్ యాదవ్ లైఫ్ స్టోరీ కూడా. పారా ఒలింపిక్స్ లో ఇండియాకు గోల్డ్ మెడల్ సాధించిన రెజ్లర్.. పుట్టుకతో చెవిటి-మూగ వ్యక్తి.

ఓ టెలివిజన్ షో కోసం వెళ్లినపుడు ఈ గూంగా పహిల్వాన్ ను కలిసిన హృతిక్.. అతని లైఫ్ పై ఆసక్తి పెంచుకున్నాడట. కమర్షియల్ మూవీకి కావాల్సిన హంగులన్నీ ఈ పారా ఒలింపిక్ రెజ్లర్ జీవితంలో ఉన్నాయని తెలియడంతో.. మూవీగా మలిచేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఎంత సాధించినా దేశానికి అంతగా తెలియని ఈ రెజ్లర్ జీవితాన్ని తెరపై ఆవిష్కరించేందుకు హృతిక్ రెడీగా ఉన్నాడట. మరి.. గ్రీక్ గాడ్ అనిపించుకునే హృతిక్.. ఇలా వైకల్యాలతో ఉండే పాత్రల్లో చేస్తుండడం ఆశ్చర్యకరమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/