Begin typing your search above and press return to search.

హృతిక్ వీడియో.. నెటిజన్లు ఫైర్ అయ్యారు

By:  Tupaki Desk   |   24 May 2018 7:01 AM GMT
హృతిక్ వీడియో.. నెటిజన్లు ఫైర్ అయ్యారు
X
కొన్నిసార్లు మంచి చెప్పాలని అనుకున్నా ఇతరులు మాత్రం మనం చేసిన తప్పులను ఎత్తి చూపటం లాంటివి చేస్తుంటారు. ఇలాంటి సందర్భాలు మాములు ప్రజలకే కాదు సెలెబ్రెటీల కు కూడా వస్తుంటాయి. ఇప్పుడు అలాంటి ఒక సందర్భంలోనే ఉన్నాడు మన బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్. మంచి చెప్పడానికి ప్రయత్నించగా అది కాస్తా బెడిసికొట్టింది ఈ ధూమ్ 2 హీరో కి.

యూనియన్ మినిస్టర్ రాజవర్ధన్ సింగ్ రథోర్ ఈమధ్యనే విరాట్ కోహ్లీ మరియు సైనా నెహ్వాల్ కు సోషల్ మీడియా లోని స్టేఫిట్ కాంపెయిన్ ను నామినేట్ చేయగా, హృతిక్ కూడా తనవంతు ప్రయత్నం చేద్దాం అని నడుం కట్టాడు. సైకిల్ తొక్కుతూ ఒక సెల్ఫీ వీడియో తీసి ఫిట్ గా ఉండండి అని చెప్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఆ వీడియో లో హృతిక్ కొన్ని బిజీ రోడ్లపైనే సైకిల్ తొక్కుతూ కనిపించాడు. అంతా బాగానే ఉంది కాని, అనుకోకుండా ఇదే వీడియో వల్ల కాంట్రవర్సీలో ఇరుకున్నాడు. హెల్మెట్ పెట్టుకోకుండా సైకిల్ తొక్కడం తప్పు, పైగా ఫోన్ లో సెల్ఫీ వీడియో తీసుకుంటూ తొక్కడం మరింత తప్పు అని కామెంట్లు మొదలుపెట్టారు. మరి కొందరైతే మన భారత దేశపు రోడ్ల పైన బైక్ అయినా కష్టమే, ఆ గుంటల రోడ్డు పైన సైకిల్ తొక్కడం అంటే మరింత కష్టం అంతో వేలెత్తి చూపారు.

కొందరు ఓపెన్ గ్రౌండ్ లో నడుపుతూ వీడియో తీయకుండా ట్రాఫిక్ ఉన్న రోడ్ లో ఇలా చెయ్యడం తప్పు, మీరేం చేస్తున్నారు అని ముంబై పోలీసుల్ని ప్రశ్నించేస్తున్నారు కూడా. మొత్తానికి చెప్పాలనుకున్న పాయింట్ బాగానే ఉన్నా, చిన్ని చిన్ని తప్పులవల్ల ఇప్పుడు నెటిజన్లు హృతిక్ చెప్పాలి అనుకున్న మాటను వదిలేసి తనపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ కండల వీరుడు ఇప్పుడు ఆనంద్ కుమార్ బయోపిక్ లోను మరియు యష్ రాజ్ ఫిలిమ్స్ లో టైగర్ శ్రోఫ్ఫ్, వాణి కపూర్ నటిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు.