Begin typing your search above and press return to search.

అల్లు హీరోయిన్ రేంజ్ పెరిగిపోతోంది

By:  Tupaki Desk   |   8 Feb 2016 5:30 AM GMT
అల్లు హీరోయిన్ రేంజ్ పెరిగిపోతోంది
X
చండీఘడ్ భామ యామీ గౌతమ్ చాలా భాషల్లోనే అదృష్టాన్ని పరీక్షించుకుంది. కన్నడ - పంజాబీ - తెలుగు - హిందీ - మలయాళం - తమిళ్ లలో తన లక్ ఎలా ఉందో ట్రై చేసింది. ఉల్లాసంగా ఉత్సాహంగా మూవీ కన్నడ రీమేక్ తో తెరంగేట్రం చేసిన ఈ సుందరి.. అల్లు శిరీష్ కి హీరోయిన్ గా 'గౌరవం' యాక్సెప్ట్ చేసి బాగా వార్తల్లో నానింది.

అంతకు ముందు నువ్విలా - ఆ తర్వాత యుద్ధం - గతేడాది కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాలతో టాలీవుడ్ లో బాగానే ప్రయత్నించింది. అయితే.. ఈమెకి బ్రేక్ మాత్రం బాలీవుడ్ లోనే లభించిందని చెప్పాలి. విక్కీ డోనర్ - యాక్షన్ జాక్సన్ - బద్లాపూర్ వంటి చిత్రాలతో ఆకట్టుకున్న యామ గౌతమ్.. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ సూపర్ స్టార్ హ్రితిక్ రోషన్ సరసన ఆఫర్ దక్కించుకుంది. గత కొన్నాళ్లుగా హ్రితిక్ -రాకేష్ రోషన్ కాంబినేషన్ లో రానున్న మూవీపై అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. పరిణీతి చోప్రా - శ్రద్ధా కపూర్ లను హీరోయిన్ తీసుకున్నారని అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం క్లారిటీ వచ్చేసింది.

త్వరలో షూటింగ్ ప్రారంభించుకోనున్న 'కాబిల్' మూవీలో యామీ గౌతమ్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు రాకేష్ రోషన్ అధికారికంగా ప్రకటించాడు. దీంతో కొన్నాళ్లుగా వినిపిస్తున్న రూమర్స్ కి చెక్ పడింది. ప్రస్తుతం పుల్కిత్ సామ్రాట్ తో సనమ్ రే, జునూనియత్ చిత్రాలు చేస్తున్న యామీ.. తొలిసారిగా స్టార్ హీరో సినిమాలో ఆఫర్ దక్కించుకుంది.