బేబి!! కలిసుందాం.. రా

Fri May 19 2017 15:55:22 GMT+0530 (IST)

సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు..  విడాకులు మామూలే. పెళ్లయ్యాక అన్యోన్యంగా ఉన్నాయనుకునే జంటలు ఎన్నో కోర్టు మెట్లెక్కి విడాకులు తీసుకున్నాయి. కొందరు వివాదాలతో విడాకులు తీసుకుంటే.. ఇంకొందరు మాత్రం ఫ్రెండ్లీగానే విడిపోతుంటారు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా ఈ బాపతే. తన బాల్య స్నేహితురాలు సుసానే ఖాన్ తో 14 సంవత్సరాల క్రితం జంట కట్టిన హృతిక్ ఉన్నట్టుండి రెండేళ్ల క్రితం డైవోర్స్ తీసుకున్నాడు. వీరిద్దరి డైవోర్స్ తీసుకోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది. వీరిద్దరికీ హ్రీహాన్ - హృదాన్ అనే ఇద్దరు పిల్లలున్నారు.

భార్యతో అఫీషియల్ గా విడిపోయినప్పటికీ హృతిక్ పిల్లల మంచిచెడులను దృష్టిలో ఉంచుకుని ఆమెతో మంచి సంబంధాలే మెయిన్ టెయిన్ చేస్తున్నాడు. వీలున్నప్పుడల్లా మాజీ భార్య పిల్లలతో కలిసి డిన్నర్లకు పార్టీలకు హాలిడే ట్రిప్ లకు వెళుతూనే ఉన్నాడు. డైవర్స్ తీసుకున్నప్పటి నుంచి సుసానే పిల్లలతో కలిసి దూరంగా వేరే ప్రాంతంలో ఉంటోంది. పిల్లలకు దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో హృతిక్ రీసెంట్ గా తన ఇంటికిదగ్గరలోనే సుసానేకు మాంచి పోష్ అపార్ట్ మెంట్ కొని గిఫ్ట్ గా ఇచ్చాడు. సుసానే కూడా అతడి గిఫ్ట్ ను అంగీకరించి కొత్త అపార్ట్ మెంట్ లోకి షిఫ్టవడానికి డిసైడైపోయింది.

సుసానే కూడా డైవర్స్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు హృతిక్ ను పల్లెత్తు మాటనలేదు. పైగా కంగనా రనౌత్ హృతిక్ ల మధ్య లీగల్ వార్ జరిగినప్పుడు హృతిక్ పక్షానే నిలిచింది. తన తప్పును సరిదిద్దుకునేందుకు హృతిక్ చేస్తున్న ప్రయత్నాలను సుసానే అర్ధం చేసుకుని అతడితో కలిసి ఉండాలనేది అభిమానుల ఆకాంక్ష. ఎన్నో ఆశలు పెట్టుకున్న మొహెంజొదారో బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేయడంతో హృతిక్ రోషన్ తనకు కలిసొచ్చిన క్రిష్ సిరీస్ లో నాలుగో సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత భజరంగీ భాయీజాన్ దర్శకుడు కబీర్ ఖాన్ దర్శకత్వంలో యాక్షన్ ప్రధాన చిత్రం చేయబోతున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/