Begin typing your search above and press return to search.

వేధింపుల ద‌ర్శ‌కుడిని రీప్లేస్ చేయ‌లేదా?

By:  Tupaki Desk   |   10 Feb 2019 7:52 AM GMT
వేధింపుల ద‌ర్శ‌కుడిని రీప్లేస్ చేయ‌లేదా?
X
2018 ఆద్యంతం లైంగిక వేధింపులపై ఆరోప‌ణల ఫ‌ర్వం అట్టుడికించిన సంగ‌తి తెలిసిందే. మీటూ ఉద్యమంలో ప‌లువురు అగ్ర ద‌ర్శ‌కుల పేర్లు బ‌య‌ట‌కు రావ‌డంతో బాలీవుడ్ స‌హా అన్ని ప‌రిశ్ర‌మ‌లు షాక్ కి గుర‌య్యాయి. ఆ క్ర‌మంలోనే ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కుడు వికాస్ బాల్ పైనా తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. స్టార్ హీరో హృతిక్ రోష‌న్ క‌థానాయ‌కుడిగా `సూప‌ర్ 30` వంటి ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న వికాస్ ని అర్థాంత‌రంగా ప్రాజెక్టు నుంచి త‌ప్పించాల్సి వ‌చ్చింది. వికాస్ చేసిన ప‌ని క్ష‌మార్హం కాద‌ని హృతిక్ సైతం అంగీక‌రించారు. అదంతా గ‌తం అనుకుంటే .. వ‌ర్త‌మానంలో ఈ ప్రాజెక్టు గురించి ప‌లు ఆస‌క్తిక‌ర సంగ‌తులు తెలిశాయి.

తాజాగా సూప‌ర్ 30 రిలీజ్ తేదీని ప్ర‌ఖ్యాత క్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ వెల్ల‌డించారు. 2019 జూలై 26న సినిమా రిలీజ‌వుతోంది. ఆ మేర‌కు రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌రించింద‌ని త‌ర‌ణ్ ట్వీట్ చేశారు. రిలీజ్ తేదీని ప్ర‌క‌టించ‌డ‌మే కాదు ఆరోప‌ణ‌ల వేళ ద‌ర్శ‌కుడి తొల‌గింపు గురించి రిల‌య‌న్స్ సీఈవో ప్ర‌స్థావించారు. వికాస్ బాల్ స్థానంలో వేరొక‌ ద‌ర్శ‌కుడి తీసుకోలేద‌ని వెల్ల‌డించారు. అంటే వికాస్ ని తొల‌గించ‌కుండానే.. అసిస్టెంట్ల‌తో ఇన్ సైడ్ మ్యానేజ్ చేసార‌ని అర్థ‌మ‌వుతోంది.

వాస్త‌వానికి ద‌ర్శ‌కుడు వికాస్ పై ఆరోప‌ణ‌లు వ‌చ్చేట‌ప్ప‌టికే `సూప‌ర్ 30` చిత్రీక‌ర‌ణ మెజారిటీ పార్ట్ పూర్త‌యింది. బ్యాలెన్స్ చిత్రీక‌ర‌ణ‌ను అసిస్టెంట్ల‌తో పూర్తి చేశారు. ఆ త‌ర్వాత పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో వికాస్ ఇన్వాల్వ్ మెంట్ లేద‌ని తెలుస్తోంది. ఎట్ట‌కేల‌కు సినిమా పూర్తి చేసి రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ తేదీపై స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది కాబ‌ట్టి ప్ర‌చారం ప‌రంగానూ వేగం పెంచుతున్నార‌ట‌. గ‌ణిత‌శాస్త్ర మేధావి ఆనంద్ కుమార్ జీవిత‌క‌థ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. రాజు కొడుకే రాజు కాదు.. పేద‌వాడు రాజు కాగ‌ల‌డు! అనేది ఈ సినిమా థీమ్. ఎంతో పేద‌రికంలో జ‌న్మించిన ఆనంద్ కుమార్ గొప్ప గ‌ణిత శాస్త్ర‌జ్ఞుడిగా ఎద‌గ‌డ‌మే గాక త‌న‌లాంటి 30 మంది పేద విద్యార్థుల్ని ఐఐటీ- జేఈఈ వంటి ప‌రీక్ష‌ల‌కు తర్ఫీదునిచ్చి వారిని గొప్ప‌వాళ్ల‌ను చేసిన ఘ‌నుడిగా పేరు తెచ్చుకున్నారు. అందుకోసం అత‌డు ఎంతో శ్ర‌మించారు. ఆ ఇతివృత్తాన్ని తెర‌పైకి తెచ్చారు. అందుకే ఈ చిత్రం ఈ స‌మ్మ‌ర్ లో మోస్ట్ అవైటెడ్ మూవీగా పాపుల‌ర్ అవుతోంది. గుజారిష్, కాబిల్ వంటి చిత్రాల్లో ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌ల్లో న‌టించిన హృతిక్ రోష‌న్ మ‌రోసారి ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లో అభిమానుల్ని మెప్పించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. సూప‌ర్ 30 ఎలాంటి ట్రీట్ ని ఇవ్వ‌బోతోందో వేచి చూడాల్సిందే.