Begin typing your search above and press return to search.

ఎమోష‌న్ ఆపుకోలేక ఏడ్చేసిన స్టార్ హీరో!

By:  Tupaki Desk   |   12 July 2019 4:28 AM GMT
ఎమోష‌న్ ఆపుకోలేక ఏడ్చేసిన స్టార్ హీరో!
X
హాలీవుడ్ హీరోల‌ని త‌ల‌పించే బాలీవుడ్ హీరో హృతిక్ రోష‌న్‌. ఇండియ‌న్ హీరోల్లో సూప‌ర్ హీరో సినిమాల‌కు అర్హ‌త‌ గ‌ల ఏకైక హీరో ఎవ‌రైనా వున్నారంటే నిస్సందేహంగా అది హృతిక్ మాత్ర‌మే అని ముక్త‌కంఠంతో చెబుతారు. ఇప్ప‌టికే బాలీవుడ్ తెర‌పై క్రిష్‌ సిరీస్‌ ల‌తో సూప‌ర్ హీరో అనిపించుకున్న హృతిక్ లైఫ్ లో ఊహించ‌ని స‌న్నివేశం ఎదురైంది. ఆయ‌న ఎంతో ఎమోష‌న్ అయ్యి క‌న్నీళ్లు పెట్టుకున్నారు. మ‌నం కోరుకున్న‌ది క‌ళ్లెదుట సాక్షాత్క‌రిస్తే ప‌ట్ట‌లేని ఆనందంతో క‌ళ్లు చెమ‌ర్చుతాయి. ఇంకా ఆ ఎమోష‌న్ ఎక్కువైతే ఆనంద భాష్పాలుగా మార‌తాయి. ఇదే అనుభూతి బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్‌కు ఎదురైంది. త‌న పంథాకు భిన్నంగా హృతిక్ రోష‌న్ న‌టించిన `సూప‌ర్‌30` ఈ ఎపిసోడ్ కి కార‌ణ‌మైంది.

గ‌ణిత శాస్త్ర‌వేత్త‌ ఆనంద్ కుమార్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. వికాస్ బెహ‌ల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ ఈ శుక్ర‌వారం విడుద‌లల‌వుతోంది. ఈ సంద‌ర్భంగా ముంబైలో బాలీవుడ్ సెలెబ్రిటీల కోసం ఆడియ‌న్స్ మ‌ధ్య ప్ర‌త్యేక ప్రీమియ‌ర్ ని ఏర్పాటు చేశారు. సినిమా ఆద్యంతం డీ గ్లామ‌ర్ పాత్ర‌లో హృతిక్ స్ట‌న్నింగ్ పెర్ఫార్మెన్స్‌ తో ఆక‌ట్టుకున్నార‌ట‌. త‌న‌ న‌ట‌న‌కు ముగ్థులైన ఆడియన్స్ రియాక్ష‌న్ చూసిన హృతిక్ రోష‌న్ క‌ళ్ల‌ల్లో నీళ్లు తిరిగాయ‌ట‌. సినిమా చూస్తున్నంత సేపు ఆడియ‌న్స్ పిన్ డ్రాప్ సైలెన్స్‌ గా వుండి భావోద్వేగానికి లోనైయ్యార‌ని.. సినిమా పూర్త‌య్యాక స్టాండిండ్ ఓవేష‌న్ ఇవ్వ‌డం హృతిక్ హృద‌యాన్ని తాకింద‌ట‌.

ప్ర‌తీ ఆడియ‌న్ ఎమోష‌న్‌కు లోనై హృతిక్ రోష‌న్‌ ని ఆత్మీయంగా హ‌గ్ చేసుకోవ‌డంతో మ‌రింత ఎమోష‌న‌ల్ అయిన‌ట్లు తెలిసింది. బ‌రువెక్కిన హృద‌యాల‌తో ప్రీమియ‌ర్ థియేట‌ర్ ఒక్క‌సారిగా ఎమోష‌న‌ల్ వాతావ‌ర‌ణంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింద‌ట‌. మ్యాథ‌మెటీషిన్ ఆనంద్ కుమార్ బీహార్‌ కి చెందిన స్టూడెంట్స్‌ని ఐఐటీ-జేఈఈలో నంబ‌ర్ వ‌న్ ర్యాంక‌ర్స్‌గా తీర్చిదిద్దిన విష‌యం తెలిసిందే. మృణాల్ ఠాకూర్, పంక‌జ్ త్రిపాఠి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. బాలీవుడ్ మొత్తం ఈ సినిమా కోసం ఎదురుచూస్తోంది. హృతిక్ కు పోటీగా త‌న చిత్రాన్ని విడుద‌ల చేయాల‌నుకున్న కంగ‌న ఈ సినిమా చూసి మ‌ళ్లీ ఎలాంటి రుబాబ్ చేస్తుందో చూడాలంటున్నారు ఫ్యాన్స్. ఇక ఇప్ప‌టికే సూప‌ర్ 30 రివ్యూలు అంత‌ర్జాలంలోకి వ‌చ్చేశాయి. వీటిలో మిశ్ర‌మ స్పంద‌న‌లు క‌నిపిస్తున్నాయి.