Begin typing your search above and press return to search.

నాతో పోటీ.. షారూక్ దే తప్పు

By:  Tupaki Desk   |   21 Jan 2017 9:49 AM GMT
నాతో పోటీ.. షారూక్ దే తప్పు
X
టాలీవుడ్ లో ఈ సారి పొంగల్ కి దిగ్గజాల పోటీ చూశారు తెలుగు ఆడియన్స్. చిరంజీవి కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150.. బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిలు.. ఒకరోజు గ్యాప్ లో వచ్చి మంచి సక్సెస్ సాధించాయి. ఈ సారి రిపబ్లిక్ డే సందర్భంగా బాలీవుడ్ లో కూడా ఇలాంటి పోటీనే నెలకొంది.

జనవరి 25న షారూక్ ఖాన్ నటించిన రాయీస్.. హృతిక్ రోషన్ మూవీ కాబిల్ లు రిలీజ్ కాబోతున్నాయి. ఇలా తమ సినిమాతో పోటీకి రావడం షారూక్ చేస్తున్న తప్పు అంటున్నాడు హృతిక్ తండ్రి రాకేష్ రోషన్. ఇఫ్పుడు హృతిక్ కూడా సేమ్ ఫీలింగ్ వ్యక్తం చేశాడు. మూడు నెలలకు ముందే రిలీజ్ కావాల్సి ఉన్న కాబిల్ ను పోటీ లేకుండా విడుదల చేసే ఉద్దేశ్యంతోనే ఇన్నాళ్లు ఆగామని చెప్పిన హృతిక్.. ఇప్పుడు తమ సినిమాకి పోటీగా రాయీస్ రిలీజ్ చేయడం ఏంటి అని నిలదీస్తున్నాడు.

అయితే.. నిజానికి రాయీస్ కూడా గత జూలై నాటికే రావాల్సి ఉంది. సుల్తాన్ తో పోటీ తప్పించడానికి రాయీస్ ని పోస్ట్ పోన్ చేశారు. జనవరి 25 కానీ.. 26 కానీ రిలీజ్ చేస్తామని షారూక్ ముందుగానే చెప్పిన వీడియోలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో హృతిక్ చేసిన కామెంట్స్ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఇలా పోటాపోటీగా రిలీజ్ చేస్తుండడంతో.. రెండు సినిమాలకు నష్టం తప్పదంటున్నారు ట్రేడ్ జనాలు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/