Begin typing your search above and press return to search.

ప్రపంచ అందగాడు మన హీరోనే

By:  Tupaki Desk   |   16 Jan 2018 7:53 AM GMT
ప్రపంచ అందగాడు మన హీరోనే
X
ఎవరు ఎన్ని చెప్పినా అందం అనే విషయంలో మాత్రం భారతీయులతో పోటీ పడేవారు ఈ ప్రపంచంలోనే లేరు అనేది అతిశయోక్తి కాదు. అందుకే ఖండాలు దాటి దేశాలు దాటి మనవాళ్ళు సినిమా రంగంలో, గ్లామర్ ప్రపంచంలో విజయ కేతనం ఎగరేస్తూనే ఉన్నారు. తాజాగా బాలీవుడ్ హార్ట్ త్రోబ్ హృతిక్ రోషన్ మరో ఘనత సాధించాడు. ఒక అంతర్జాతీయ వెబ్ సైట్ ఇచ్చిన ర్యాంకింగ్స్ లో ప్రపంచంలోని అందమైన నటులలో హృతిక్ రోషన్ నెంబర్ వన్ ప్లేస్ సాధించాడు. ఇంటర్నేషనల్ స్టార్స్ రాబర్ట్ పాటిన్సన్(2) - క్రిస్ ఎవాన్స్(4) - హెన్రీ కావిల్(8) - టాం హిడెల్ స్టన్(9)దాటేసి మరీ దీన్ని కొట్టేసాడు. హృతిక్ రోషన్ కి ఇవి కొత్తమి కాదు. గతంలో కూడా సెక్సీయస్ట్ ఆసియన్ మెన్, హాటెస్ట్ స్టార్ అఫ్ ది ప్లానెట్ టైటిల్స్ కూడా గెలుచుకున్న హృతిక్ ఇది మాత్రం చాలా చాలా స్పెషల్ గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఇంతవరకు ఏ భారతీయుడు సాధించని ఘనత ఫాన్స్ కి గిఫ్ట్ గా ఇచ్చాడుగా.

దీని పట్ల బాలీవుడ్ సన్నిహితులు, కో స్టార్స్ నుంచి ప్రశంశల వర్షం కురుస్తోంది. పెద్ద కమర్షియల్ హీరోలుగా పేరు తెచ్చుకున్నా ఖాన్ల ద్వయం ఈ ఫీట్ సాధించలేకపోయింది. ఇంత క్రేజ్ హృతిక్ కి రావడం కొత్తేమి కాదు. 18 ఏళ్ళ క్రితం 2000 వ సంవత్సరం తన మొదటి సినిమా కహో నా ప్యార్ హై తోనే దేశవ్యాప్తంగా కోట్లాది యువతీ యువకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఒక్క సినిమాకే ఇంత ఫాలోయింగ్ చూసి బాలీవుడ్ దిగ్గజాలు సైతం నోరెళ్ళ బెట్టారు. ఆ సంవత్సరంలోనే అది బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం ఇంకా ఎవరు మర్చిపోలేదు. ఒక ఏడాది పాటు హృతిక్ మేనియాతో పాటు ఆ సినిమాలోని పాటలే దేశం మొత్తం వినిపించాయి. ఆ రేంజ్ సక్సెస్ తరువాత అనుకోనప్పటికి హృతిక్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఓ మోస్తరు హిట్స్ తో ఎప్పటికప్పుడు మెప్పించే ప్రయత్నం చేస్తున్న హృతిక్ లుక్స్ అండ్ బాడీ ఫిట్నెస్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాడు. అందుకే మోస్ట్ హ్యాండ్ సం యాక్టర్ 2018గా గుర్తింపు రావడం అతనికే కాదు సినిమా ఫాన్స్ కి కూడా పండగ లాంటి వార్తే.