ట్రైలర్ టాక్: బ్రిడ్జిపై తెలుగు పిల్ల భలే

Thu Oct 12 2017 12:12:21 GMT+0530 (IST)

అసలు తెలుగులో తెలుగు హీరోయిన్లు లేరేంటి అనుకుంటున్న వేళ.. కొంతమంది బాగానే ఇంప్రెస్ చేస్తుంటారు. కాకపోతే వారి ఖాతాలో ఆ ఒక్క హిట్టు మాత్రం పడటంలేదు. అలా పడితే ఎక్కడే ఉంటారో అని అనిపించుకునే భామల్లో.. యుట్యూబ్ బ్యూటి చాందిని చౌదరి కూడా ఉంటుంది. అందంగా ఉంటుంది.. అభినయం బాగుంటుంది.. చాలా సినిమాల్లో మెయిన్ లీడ్ చేసింది.. కాని బ్రేక్ మాత్రం ఇంకా రాలేదు.అయితే ఇప్పుడు ''హౌరా బ్రిడ్జ్'' అనే సినిమాతో ఆ బ్రేక్ వచ్చేస్తోందా అనిపించక మానదు. రెవాన్ యాదు అనే దర్శకుడు రూపొందించిన ఈ సినిమా టీజర్ చూస్తే.. చాందిని చాలా బ్యూటిఫుల్ గా క్యూటుగా కనిపిస్తోంది. ఈ సినిమాలో తమిళ హీరో రాహుల్ రవీంద్రన్ మెయిన్ లీడ్. టీజర్లో రాహుల్ అండ్ చాందిని కెమిస్ర్టీ బాగుందనే చెప్పాలి. ముఖ్యంగా శేఖర్ చంద్ర అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కారణంగా.. వీరి రొమాన్స్ మరింత తారాస్థాయికి చేరింది. అయితే ఒక కలకత్తాలోని హౌరా బ్రిడ్జ్ పై ఈ తెలుగు పిల్ల ఆ తమిళ కుర్రాడు.. ఎలా కలిశాడు ఎందుకు విడిపోయారు ఇప్పుడు ఆ బ్రిడ్జ్ వీరిని ఎలా కలుపుతుంది అనేదే కథాంశంగా కనిపిస్తోంది.

అసలే ఈ మద్యన ఫిదా వంటి సున్నితమైన లవ్ స్టోరీలు హిట్టువుతున్న వేళ.. చాందిని చౌదరి కూడా తన తొలి హిట్టును ఈ సినిమాతో ఖాతాలో వేసుకుంటుందా? లెటజ్ సీ.