మినిమమ్ ఈ ఐడియా రాకపోతే నాకు బుద్ది లేనట్టే!

Sun Nov 18 2018 22:40:05 GMT+0530 (IST)

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తన లాస్ట్ సినిమా 'నోటా' తో నిరాశపరిచినా..  తాజా చిత్రం 'టాక్సీవాలా' తో మరోసారి ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పటికే సినిమా మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.  రా-ఫుటేజ్ పైరసీ కి గురై బయటకు వచ్చినప్పటికీ ఈ సినిమా కు దక్కిన ఆదరణతో విజయ్ దేవరకొండతో పాటు 'టాక్సీవాలా' టీమ్ మెంబర్స్ అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.విజయ్ తన సినిమాలకు డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేపడతాడు. సినిమా ప్రమోషన్స్ మాత్రమే కాదు.. తన ఐడియాస్ కూడా డిఫరెంట్ గానే ఉంటాయి. .   తాజాగా 'టాక్సీవాలా' కోసం అదే రూట్ లో క్యాబ్ డ్రైవర్ అవతారమెత్తి కస్టమర్స్ ను వారి గమ్యస్థానాలకు చేర్చాడు. ఈ తతంగమంతా వీడియో తీసి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు.  అందులో ఒక విజయ్ కార్ ఎక్కిన ఒక మహిళ "విజయ్ నీకిలాంటి క్రేజీ ఐడియాస్ ఎలా వస్తాయి?" అని ప్రశ్నించింది.  విజయ్ దానికి సమాధానంగా "ఒక టాక్సీ డ్రైవర్ సినిమా చేస్తున్నప్పుడు మినిమమ్ ఈ ఐడియా రాకపోతే నాకు బుద్ది లేనట్టే!" అంటూ ఓపెన్ గా చెప్పేశాడు.

దాని మినిమిమ్ ఐడియా అని ఎవ్వరూ అనుకోవడం లేదు విజయ్..క్రేజీ ఐడియా అనుకుంటున్నారు. ఇవే ఐడియాలు ఇతర యంగ్ హీరోలకు వస్తే వాళ్ళు ఈపాటికే స్టార్స్ అయి ఉండే వారుగా? ఈజింట్ ఇట్ ఎ కరెక్ట్ లాజిక్?

వీడియో కోసం క్లిక్ చేయండి