Begin typing your search above and press return to search.

పీరియడ్స్ పై సోనమ్ సంతోషం

By:  Tupaki Desk   |   15 Jan 2018 8:04 AM GMT
పీరియడ్స్ పై సోనమ్ సంతోషం
X
పీరియడ్స్ రావడం మహిళల లైఫ్ సైకిల్ లో ఒక భాగం. కానీ మన దేశంలో ఈ టాపిక్ గురించి మాట్లాడేందుకు ఎవరూ సిద్ధంగా ఉండరు. కానీ ఇప్పుడీ సబ్జెక్ట్ ని బేస్ చేసుకుని ఓ సినిమా వచ్చేస్తోంది. ప్యాడ్ మ్యాన్ పేరుతో అక్షయ్ కుమార్ హీరోగా రూపొందిన ఈ చిత్రం.. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల అవుతోంది. మహిళలు పీరియడ్స్ ఉపయోగించే శానిటరీ నాప్కిన్స్ తయారీ కోసం కష్టపడిన ఓ వ్యక్తి కథే ఇది.

ఈ మూవీలో హీరోయిన్స్ గా రాధికా ఆప్టే.. సోనమ్ కపూర్ నటించారు. సినిమాలలో నటించిన ప్రభావమో ఏమో కానీ.. సోనమ్ కపూర్ కూడా పీరియడ్స్ పై తెగ మాట్లాడేస్తోంది. పైగా తన పీరియడ్స్ గురించి కూడా కబుర్లు చెప్పేస్తోందంటే.. సోనమ్ ఈ మూవీలో నటించడంతో ఏ రేంజ్ లో ఇన్ స్పైర్ అయిందో అర్ధమవుతుంది. ప్యాడ్ మ్యాన్ ప్రమోషన్లలో పాల్గొంటున్న సోనమ్ కపూర్ కు ఓ టిపికల్ క్వశ్చన్ ఎదురైంది. మొదటిసారి పీరియడ్స్ వచ్చినపుడు ఆమె ఎలా ఫీలియందన్నదే ఈ ప్రశ్న. దీనికి సోనమ్ నుంచి షాకింగ్ ఆన్సర్ వచ్చింది.

తనకు మొదటిసారి పీరియడ్స్ వచ్చినపుడు చాలా సంతోషించా అంటోంది ఈ బాలీవుడ్ భామ. ఇందుకు కారణం.. ఆమె తోటి వయసు వారికి.. స్నేహితులకు అప్పటికే పీరియడ్స్ ప్రారంభమైపోగా.. ఈమెకు మాత్రం బాగా ఆలస్యమైందట. అలా లేట్ కావడంపై తెగ ఆలోచించి చింతించిన సోనమ్.. పీరియడ్స్ ప్రారంభం అయినపుడు బోలెడంత ఆనందించేసిందట.