Begin typing your search above and press return to search.

మిస్టర్ వాస్తు బాగోలే!!

By:  Tupaki Desk   |   20 April 2017 7:25 AM GMT
మిస్టర్ వాస్తు బాగోలే!!
X
తెలుగు పరిశ్రమ లో కొంతమందికి సెంటిమెంట్స్ ఎక్కువ ఉంటాయీ పైగా వాటిని బాగా సీరియస్ గా తీసుకున్న వాళ్ళూ ఉన్నారు. అలాంటి రకరకాల సెంటిమెంట్లలో సినిమా ఆఫీస్ వాస్తు.. దర్శకనిర్మాతల ఇంటి వాస్తు.. కూడా చాలా ముఖ్యంగా చూసుకుంటారు. ఇప్పుడు మిష్టర్ డైరక్టర్ కు అలాంటి ప్రాబ్లమే వచ్చిందట.

డైరెక్టర్ శ్రీను వైట్ల వరస ఫెయిల్యూర్లతో పూర్తిగా ఆఫ్ ట్రాక్ లో ఉన్నాడు. మిస్టర్ సినిమా ముందు చాల కాన్ఫిడెంట్ గా ఉన్న శ్రీనుకి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గరే బోల్తా పడ్డంతో గట్టి దెబ్బ తగిలింది. తను మళ్ళి సక్సెస్ ఫార్ములా లోకి వస్తాడు అని అనుకున్నారు సినీ వర్గాలు కానీ అలా జరగలేదు.దీనికి ప్రధాన కారణం అతని ఇంటి వాస్తు అని అతనికి సన్నిహితంగా ఉన్నవాళ్లు చెప్పుతున్నారు. ‘ఆగడు’ సినిమా అప్పుడు శ్రీను జూబిలీహిల్స్ లో ఉన్న కొత్త ఇంటిలోకి వెళ్ళాడు. ఆ సినిమా ఎంత పెద్ద ఫ్లాప్ అయిందో వేరే చెప్పాలా. అప్పటికే వాస్తులో కొన్ని మార్పులు చేసినా అంతగా కలిసిరాలేదు. దాని తరువాత వచ్చినా బ్రూస్ లీ కూడా ఫెయిల్ అయింది. ఇంకా వాస్తు అనుమానం నిజం అని అతను నమ్మే స్థితికి వచ్చారు.

ఇప్పుడు కూడా శ్రీను తన ఇంటి కి మళ్ళి వాస్తు సరిద్దిదే పనిలో ఉన్నాడు అని చెప్పుతున్నారు. అసలు కథలో మార్పులు చేసి మంచి కథ లు ఎన్నుకొని ముందుకు వెళ్ళాలి కానీ ఇంటిలో వాస్తు మారిస్తే సినిమా ఎలా హిట్ అవుతుంది?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/