Begin typing your search above and press return to search.

హాలీవుడ్ టు టాలీవుడ్ వచ్చేస్తున్నారు

By:  Tupaki Desk   |   27 April 2017 12:37 PM GMT
హాలీవుడ్ టు టాలీవుడ్ వచ్చేస్తున్నారు
X
తెలుగులో సైన్స్ ఫిక్షన్ మూవీస్ కానీ.. భారీ యాక్షన్ సినిమాలు కానీ రావడం చాలా అరుదు. వచ్చినా అందులో హాలీవుడ్ క్వాలిటీ ఉండదు అనేది చాలామంది ఫీలింగ్. ఇప్పుడు ప్రపంచీకరణతో అన్నీ ఒక్క చోటుకి వస్తున్నాయ్. అందరూ అందరితో కలవడానికి సులభతరం అవుతుంది. హాలీవుడ్ లో ఉండే సాంకేతిక నిపుణత మన దగ్గర లేదు అనేది పాతమాట.. ఇప్పుడు మన సినిమాల కు అవసరం మేరకు అక్కడ వాళ్ళని మన తెలుగు వాళ్ళు అద్దెకు తెచ్చుకొంటున్నారు. అలా ఈ మధ్య తెచ్చుకున్న సినిమాలు ఇవిగో..

ఎన్టీఆర్ నటిస్తున్న ‘జై లవ కుశ’ ఇప్పుడు నిర్మాణం లో ఉంది. దీనికి ఆస్కార్ విన్నింగ్ మూవీ 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' కి పని చేసిన గొప్ప ప్రోస్తెటిక్స్ మేకప్ కళాకారుడు వాన్స్ హార్ట్వెల్ ఈ సినిమా కి కూడా పని చేస్తున్నారు. మేకింగ్ లో అసలు రాజీ పడేదే లేదు అని కళ్యాణ్‌ రామ్ చెప్పటం తో.. ఇతడ్ని తీసుకున్నారు. తమిళ్ డైరెక్టర్ శంకర్ రజినీకాంత్ మూవీ '2.0' కి ట్రాన్స్ఫోర్మెర్స్ కాదు ట్రాన్స్ ఫార్మర్స్ యాక్షన్ స్టంట్స్ చేసిన కెన్ని బేట్స్.. ఇప్పుడు కళ్ళు చెదిరిపోయే స్టంట్స్ కంపోజ్ చేస్తున్నాడు. సుజిత్ - ప్రభాస్ కాంబినేషన్ లో రాబోతున్న ‘సాహో’ సినిమాకు కూడా యాక్షన్ కెన్ని బేట్స్ స్టంట్స్ మనం చూడొచ్చు.

ఇంకా అఖిల్ రెండో సినిమా లో కూడా హాలీవుడ్ సాంకేతిక సిబ్బంది పనిచేస్తోంది. ఈ సినిమాలో ఇది ఒక స్పెషల్ జలక్ లా ఉండబోతుందట. దీనికి గాను టెర్మినేటర్ 2 - ఐరన్ మాన్ - కెప్టెన్ అమెరికా వంటి హాలీవుడ్ సినిమాలకు యాక్షన్ సీన్స్ చేసిన ‘బాబ్ బ్రౌన్’ అఖిల్ - విక్రమ్ కుమార్ రెండో సినిమా లో పని చేస్తున్నారు. హైదరాబాద్ లో షూటింగ్ శరవేగం వేగంగా సాగుతుంది. ఈ సినిమా లో స్టెడీ కామ్ షాట్స్ కోసం బల్గేరియా నుండి ‘నిక్కి’ అనే అతన్ని తెప్పించారు.

అలాగే నితిన్ నటిస్తున్న కొత్త మూవీ లో హాలీవుడ్ నటుడు డాన్ బల్గేరియన్ ఒక ముఖ్య పాత్ర లో కనిపించనున్నారు. మొత్తానికి మన తెలుగు సినిమా ఇప్పుడు సాహసం చేయరా డింబకా అనే తీరు లో దూసుకుపోతుంది అనే చెప్పాలి. కథ లు ఎలా ఉన్న మేకింగ్ కోసమైనా మన వాళ్ళు మారుతున్నందుకు హర్షించవచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/