Begin typing your search above and press return to search.

కొత్త కంపోజర్ కి మెగా బంపరాఫర్

By:  Tupaki Desk   |   22 Jan 2017 4:52 AM GMT
కొత్త కంపోజర్ కి మెగా బంపరాఫర్
X
ఖైదీ నంబర్ 150 సాధించిన ఘనవిజయం.. మెగాస్టార్ స్టామినాను ఎలివేట్ చేస్తే.. మెగా క్యాంప్ కాన్ఫిడెన్స్ ను ఎన్నో రెట్లు పెంచింది. దీంతో వరుసగా మెగాస్టార్ సినిమాలను రెడీ చేసేయాలని ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే మెగాస్టార్ చేయనున్న 151.. 152 సినిమాలకు సంబంధించిన వర్క్స్ చేసేస్తున్నారు కూడా.

మెగా 151ను రామ్ చరణ్ నిర్మించనున్న సంగతి తెలిసిందే. ముందుగా చెప్పినట్లుగానే చెర్రీకి ధృవతో బ్లాక్ బస్టర్ అందించిన సురేందర్ రెడ్డితోనే ఈ మూవీ చేయనున్నారట. ఇవన్నీ ఇప్పటికే వినిపించిన న్యూస్ కాగా.. ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న టాక్ ఏంటంటే.. మెగా 151కు మ్యూజిక్ డైరెక్టర్ ను సెలెక్ట్ చేసేశారట. అది కూడా ఎవరో కాదు.. టాలీవుడ్ లో అరంగేట్రంలోనే సెన్సేషన్స్ సృష్టించిన కంపోజర్.. ధృవ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిళకే ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా ధృవకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మెగాస్టార్ బాగా ఇంప్రెస్ అయ్యారని తెలుస్తోంది. అందుకే ఇప్పటికే ఈ కుర్ర కంపోజర్స్ ను పిలిచి సురేందర్ రెడ్డి మాట్లాడాడని కూడా అంటున్నారు. అయితే.. చిరు నుంచి ఇంకా ఫైనల్ డెసిషన్ మాత్రం చిరు చేతుల్లోనే ఉంటుందనే సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి తర్వాత.. చిరుతో సినిమా చేసేందుకు బోయపాటి శ్రీను రెడీ అవుతుండగా... క్రిష్ తో కూడా మాటా మంతి జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/