Begin typing your search above and press return to search.

హింది అర్జున్ రెడ్డి దుమ్ములేపాడుగా

By:  Tupaki Desk   |   22 Jun 2019 6:54 AM GMT
హింది అర్జున్ రెడ్డి దుమ్ములేపాడుగా
X
నిన్న భారీ అంచనాల మధ్య విడుదలైన అర్జున్ రెడ్డి హింది రీమేక్ కబీర్ సింగ్ ప్రేక్షకుల పాజిటివ్ రెస్పాన్స్ మధ్య మొదటి రోజు ఏకంగా 20 కోట్ల వసూళ్లు సాధించింది. ఇది గత ఏడాది వచ్చిన పద్మావత్ కంటే రెండు కోట్లు ఎక్కువ మొత్తం. అందులోనూ అది వివాదాలను ఆధారంగా చేసుకుని దీపికా పదుకునే-సంజయ్ లీలా భన్సాలీ ఇమేజ్ మీద మార్కెట్ అయ్యింది.

కాని కబీర్ సింగ్ కథ అలా కాదు. తెలుగు రీమేక్. అందులోనూ సందీప్ రెడ్డి వంగాకు బాలీవుడ్ లో డెబ్యు మూవీ. కేవలం కంటెంట్ ని ఆధారంగా చేసుకుని నిర్మాతలు హైప్ తీసుకురాగలిగారు. దాన్ని నిలబెట్టుకుంటూ యూత్ ని బాగా ఆకర్షిస్తున్న కబీర్ సింగ్ ఇవాళ శనివారం కూడా 21 కోట్ల దాకా రాబట్టవచ్చని ట్రేడ్ టాక్. ఇక ఆదివారం గురించి చెప్పేదేముంది

ఇదంతా చూస్తూ షాహిద్ కపూర్ ఆనందం మాములుగా లేదు. అతను సోలో హీరోగా ఇలాంటి ఓపెనింగ్స్ చూసి చాలా ఏళ్ళు అయ్యింది. అప్పుడెప్పుడో శాందార్ అనే సినిమాకు మంచి ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చాయి ఆ తర్వాత అది నిలబడలేదు. కాని కబీర్ సింగ్ కు ఆ ప్రమాదం లేదు. ఖచ్చితంగా ఈ ఏడాది టాప్ ఫైవ్ గ్రాసర్స్ లో ఇది నిలుస్తుందని ముంబై రిపోర్ట్స్ చెబుతున్నాయి.

పద్మవత్ అన్ని హంగులు ఉంటేనే 19 కోట్ల మార్క్ చేరలేక ఫస్ట్ డేని ముగించింది. అలాంటిది కబీర్ సింగ్ లాంటి లవ్ స్టొరీ దాన్ని బ్రేక్ చేయడం అంటే మాటలా. హీరొయిన్ కీయరా అద్వాని తనకు దక్కింగ్ మొదటి బాలీవుడ్ బ్లాక్ బస్టర్ గా ఇప్పటికే తన ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఇంకో నాలుగు రోజులు అయ్యాక కబీర్ సింగ్ ఫైనల్ రేంజ్ ఏంటో క్లారిటీ వస్తుంది