Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: బ్యాక్ లెస్ లో బిగ్ బాస్ భామ

By:  Tupaki Desk   |   23 March 2018 4:52 AM GMT
ఫోటో స్టోరి: బ్యాక్ లెస్ లో బిగ్ బాస్ భామ
X
బిగ్ బాస్ సీజన్ 11కు అతి పెద్ద అట్రాక్షన్స్ లో ఒకరిగా నిలిచిన భామ హీనా ఖాన్. తన డ్రెసింగ్ కారణంగా జనాల్లో విపరీతమైన ఆసక్తిని క్రియేట్ చేయడంలో హీనా ఖాన్ బాగా సక్సెస్ అయింది. ఆ సీజన్ లో అనేక ఎపిసోడ్స్ లో డ్రామా అంత బాగా పండడంలో అత్యంత కీలక పాత్ర ఈ బ్యూటీదే.

కాస్ట్యూమ్స్ విషయంలో హీనా ఖాన్ చాలా నీట్ గా కనిపించింది. తనకు కంఫర్ట్ గా ఉండడానికి క్యాజువల్స్.. సాంప్రదాయ దుస్తులతో మాత్రమే బిగ్ బాస్ ఎపిసోడ్స్ లో కనిపించిన హీనా ఖాన్ ఒక్కసారిగా అవతారం మార్చేసింది. గ్లామర్ డాల్ అవతారం ఎత్తేసి.. ఫోటో షూట్స్ కూడా చేసేస్తోంది. అది కూడా మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం కావడం మరీ విశేషం. ఫిట్ లుక్ అనే మేగజైన్ కవర్ పేజ్ కోసం ఫోటో షూట్ చేసిన హీనా ఖాన్.. అల్ట్రా మోడర్న్ అవతారం ఎత్తేసింది. ఈ మేగజైన్ మార్చ్ ఎడిషన్ కోసం అమ్మడిని ఎంపిక చేసుకుని.. ఆమె ఫిట్నెస్ కి గ్లామర్ జోడించి మరీ అందించారు.

సర్ ప్రైజ్ అంటూ ఈ అందాల ఫోటోను తనే అందరికీ చూపించింది హీనా ఖాన్. నీలి రంగులో ఉన్న బ్యాక్ లెస్ గౌన్ లో అమ్మడి అందాలు మరీ చూడముచ్చటగా ఉన్నాయి. పెదాల మెరుపుల నుంచి ప్రతీ డిపార్ట్ మెంట్ లో ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకున్న సంగతి అర్ధం అవుతుంది. హీనా కళ్లలో కనిపించే కాన్ఫిడెన్స్ ఈ ఫోటోకు అసలు సిసలైన అట్రాక్షన్.