Begin typing your search above and press return to search.

ప్రియాంక గౌనుపై గొడవ గొడవ

By:  Tupaki Desk   |   22 Feb 2018 9:43 AM GMT
ప్రియాంక గౌనుపై గొడవ గొడవ
X
స్టార్ హీరోయిన్ల హాట్ ఫొటో షూట్లు అప్పుడప్పుడు వివాదాస్పదం కావడం మామూలే. ప్రియాంక చోప్రా కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. గతంలోనే ఆమె ఫొటో షూట్లు కొన్ని వివాదాస్పదమయ్యాయి. తాజాగా ఆమె చిత్రాలతో రూపొందిన క్యాలెండర్ ఒకటి వివాదం రాజేసింది. నిజానికి ప్రియాంక ఎప్పుడూ కనిపించేంత హాట్ హాట్ గా ఏమీ కనిపించలేదు ఈ ఫొటోల్లో. కొంచెం గ్లామరస్ గా మాత్రమే కనిపిస్తోందామె. కాకపోతే ఆ ఫొటోలు పొందుపరిచింది అస్సాం టూరిజం శాఖ రూపొందించిన క్యాలెండర్లో కావడమే వివాదానికి కారణమైంది.

ప్రియాంకను అస్సాం టూరిజంకు ప్రచార కర్తగా నియమించారు. హాలీవుడ్ స్థాయికి ఎదిగిన ప్రియాంకను అస్సాం పర్యాటక ప్రచారకర్తగా నియమించడం పట్ల అక్కడి ప్రభుత్వం గర్వంగా ప్రకటనలు చేస్తుండగా.. ప్రతి పక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రియాంకతో సంప్రదాయ దుస్తులు వేయించకుండా.. ఇలా గ్లామరస్ గౌన్లు వేయించడమేంటంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీని వల్ల అస్సాం రాష్ట్ర పరువు పోయిందంటూ పెద్ద ప్రకటనలే చేస్తున్నారు నాయకులు. ఐతే ప్రియాంక చోప్రా ప్రపంచ‌వ్యాప్తంగా పేరు సంపాదించింద‌ని... ఆమె గ్లోబ‌ల్ స్టార్ అని.. అందుకేు ఆమెను ప్రచారకర్తగా పెట్టుకున్నామని.. ఆమె డ్రెస్సింగ్ వ‌ల్ల అస్సాంకు చెడ్డ‌ పేరంటూ ఏమీ రాదని అధికార భాజపా నేతలు అంటున్నారు.