Begin typing your search above and press return to search.

అంబానీల‌ పెళ్లికి హిల్ల‌రీ క్లింటన్

By:  Tupaki Desk   |   10 Dec 2018 4:29 AM GMT
అంబానీల‌ పెళ్లికి హిల్ల‌రీ క్లింటన్
X
ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌న‌వంతుడిగా వెలిగిపోతున్న ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి అంటే ఎలా ఉండాలి? ఆకాశ‌మంత పందిరి వేసి పంచ‌భ‌క్ష ప‌ర‌మాన్నాలు పెట్టి పంపించేస్తే స‌రిపోతుందా? వాట‌న్నిటినీ మించి డాబు-ద‌ర్పం-ద‌ర్జా క‌న‌పించాలి. పిలిస్తే కొండ మీంచి కోతి అయినా దిగి రావాలి. దిగ్గ‌జాలే త‌ల‌వొంచి పెళ్లికొచ్చి అక్షింత‌లు వేసి వెళ్లాలి. నిన్న మొన్న అంబానీ కూతురు ఇషా అంబానీ ప్రీపెళ్లి ఆ లెవ‌ల్లోనే జ‌రిగింది. దేశంలోనే ఇలాంటి వేడుక మ‌రొక‌టి లేదు అన్న తీరుగా కోట్లాది రూపాయ‌లు వెచ్చించి ఈ పెళ్లిని జ‌రిపిస్తున్నాడు అంబానీ.

ముందుగా ప్రీవెడ్డింగ్ లో భాగంగా సంగీత్ కార్య‌క్ర‌మానికి బాలీవుడ్ సెల‌బ్రిటీలంతా వ‌చ్చి వాలారు. వీళ్ల‌తో పాటు అటు ఇండ‌స్ట్రియ‌లిస్టులు - బ్యూరోక్రాట్లు - రాజ‌కీయ నాయ‌కులు - ఇత‌ర‌త్రా వ‌ర్గాల‌కు చెందిన బెస్ట్ సెల‌బ్రిటీలంతా ఈ వేడుక‌లో క్యూ కట్టారు. ఉద‌య్ పూర్ ప్యాలెస్‌లో ఓన్లీ సెల‌బ్రిటీల క్యూతోనే స‌ముద్రాన్ని త‌ల‌పించిందిట‌.

వీట‌న్నిటి న‌డుమ ఓ షాకింగ్ లేడీ వేడుక‌కే వ‌న్నె తేవ‌డం చ‌ర్చ‌కొచ్చింది. అమెరికా మాజీ అధ్య‌క్షుడు బిల్ క్లింట‌న్ భార్యామ‌ణి హిల్ల‌రీ క్లింట‌న్ అంబానీ పెళ్లి వేడుక‌లో త‌ళుకులీన‌డం చ‌ర్చ‌కొచ్చింది. అమెరికా నుంచి రారాణిలా ఉద‌య్‌ పూర్‌ లో దిగిపోయిన క్లింట‌న్ లేడీ ప్యాలెస్ ప‌రిస‌రాల‌కే కొత్త అందం తెచ్చారు. హిల్ల‌రీ ఓ న‌ల్ల‌ని హ్యాట్ ధ‌రించి స్పెష‌ల్ గా క‌నిపించారు. ఇక ఈ వేడుక‌లో సామాన్యుడి ఊహ‌కంద‌ని రేంజు సెల‌బ్రిటీలంతా ఉన్నారు. త‌లంబ్రాలు వేసి వెళ్లే వాళ్లు కొంద‌రైతే మ‌రికొంద‌రు పెళ్లి అయ్యే వార‌కూ కాల‌క్షేపం చేసి వెళ్లే వాళ్లు అక్క‌డ వాలిపోయార‌ట‌.